Rajinikanth: వయసులో చిన్నైనా సీఎం కాళ్లు మొక్కిన రజనీ కాంత్.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం జైలర్.. ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదల అయిన 10 రోజుల్లోనే ఈ మూవీ 500కోట్లు కొల్లగొట్టిందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రజినీ కాంత్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన కన్న వయసులో చిన్న అయిన యోగి ఆదిత్యనాథ్ కాళ్లను రజినీ మొక్కడం చర్చనీయంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఇక ఈ మూవీని సన్ పిక్చర్ బ్యానర్ పై నిర్మాత కళానిధిమారన్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇక రజినీ కాంత్ సరసన సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా.. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక అనిరుద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది.

Superstar Rajinikanth Takes Blessings of Up CM Adityanath By touching his Feet Video Viral

జైలర్ మూవీ ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. 3000వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 10 రోజుల్లోనే రికార్డులు బ్రేక్ చేస్తూ.. 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Superstar Rajinikanth Takes Blessings of Up CM Adityanath By touching his Feet Video Viral

ఇక రజినీ కాంత్ కు వయసు అయిపోయింది.. ఆయనకు 70ఏళ్ల వయసులో సినిమాలు అవసరమా అనే వాళ్లకు జైలర్ తో సమాధానం ఇచ్చేశారు. ఇక ఈ మూవీలో రజినీ యాక్టింగ్, స్టైల్, స్వాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కంటే ముందు హిమాలయాలకు వెళ్లిపోయిన రజినీకాంత్ అక్కడ నుంచి ఝార్ఖండ్ లోని మరో దేవాలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నారు.

అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్లిన రజినీ కాంత్... అయోధ్య రాముడిని దర్శించుకునే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముందే ఉత్తరప్రదేశ్ గవర్నర్ తో భేటీ అయిన అయ్యారు. ఇక శనివారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ సినిమా వీక్షించారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన సమయంలో రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్ల మీద పడడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం మీద రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వయసు 60 ఏళ్ల లోపే ఉండగా.. . అదే రజనీకాంత్ వయసు మాత్రం 72 ఏళ్లకు పైగానే ఉంటుంది. అలా ఒక పెద్ద వయసు వ్యక్తి చిన్న వయసు వ్యక్తి కాళ్ల మీద పడటం ఏమిటా? అని అందరూ ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి కావడం కంటే ముందే ఆదిత్యనాథ్ యోగిగా సన్యాసిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అన్ని వదిలేసి... ఒక యోగిగా, సన్యాసిగా జీవితం గడుపుతున్నారు. అందుకే ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం రజినీ తీసుకున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X