సినిమాల నుంచి రజనీకాంత్ రిటైర్మెంట్.. ప్రకటించేది అప్పుడే!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. రజనీకాంత్ ప్రస్తుతం వరుస చిత్రాలకు ఒకే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితమే రజనీకాంత్ కొత్త చిత్రం దర్భార్ ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. దర్బార్ తర్వాత రజని మరో రెండు చిత్రాలకు కూడా ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
రజనీకాంత్, కేఎస్ రవికుమార్ లది సూపర్ హిట్ కాంబినేషన్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో మరో చిత్రంలో నటించేందుకు రజని ఓకే చెప్పారట. వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత రజనీకాంత్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

రాజకీయాల్లోకి వస్తున్నానని రజని ప్రకటించిన తర్వాత కొత్తగా ఎలాంటి పార్టీని స్థాపించలేదు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీనితో రజనీకాంత్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా మారడంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి రజని తన సినిమాలన్నింటినీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











