బరువెక్కుతున్న సూపర్ స్టార్... సర్కారువారి పాటలో మాస్ మసాలా కోసమే...!
సాధారణంగా హెయిర్ స్టైల్ లో తప్ప లుక్స్ తో పెద్దగా ప్రయోగం చేసేందుకు మహేశ్ బాబు ఇష్టపడడు అన్న సంగతి తెలిసిందే. గతంలో అతిథి సినిమా సమయంలో ఇలాంటి ప్రయోగమే చేసి దెబ్బతినడంతో అప్పటినుంచి సేమ్ లుక్స్ తోనే పనికానిచ్చేస్తున్నాడు. అయితే సర్కారు వారి పాట కోసం ఈ రోటీన్ లుక్స్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడట మన ప్రిన్స్.
ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో టాటూలతోనూ, చెవి పోగులతోనూ దర్శనమిచ్చిన మహేశ్, తన పాత్ర కోసం కాస్త బరువు పెరిగేందుకు సన్నద్ధం అవుతున్నాడు. సినిమాలో మాస్ లుక్స్ కు జస్టిఫై చేసేందుకు తన డైట్ ప్లాన్ కూడా మార్చేసుకున్నాడట సూపర్ స్టార్. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో వర్కౌట్లు చేస్తూ క్రమంగా బరువు పెరుగుతున్నాడట.

కాస్త బరువు పెరగడం ద్వారా సర్కారు వారి పాటలో తన మాస్ లుక్స్ మరింతగా ఎలివేట్ అవుతాయని భావిస్తున్నాడట మహేశ్. షూటింగ్ లు ఏమీ లేకపోవడంతో మిలిగిన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్న ప్రిన్స్, ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్ డేట్స్ ను జనాలతో పంచుకంటూ వారితో టచ్ లోనే ఉంటున్నాడు. మరి తన పాత్రకోసం ఇంతలా కష్టపడుతున్న ప్రిన్స్, ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











