Sai Durgha Tej: అమ్మ అనాథాశ్రమానికి మెగా హీరో విరాళం.. ఎంత ఇచ్చారంటే ?
Sai Durgha Tej : సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు మామ పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణకు 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ రోజు మరో ఆర్థిక సాయం చేస్తారు.
తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ విజయవాడలోని అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందజేశారు. బుధవారం విజయవాడలో పర్యటించిన ఆయన ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. అనంతరం అమ్మ అనాథాశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమంలో ఉంటున్నా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అమ్మ అనాథశ్రమానికి రూ.2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ.3లక్షల విరాళం అందజేశారు. చెక్కులను అందజేసిన అనంతరం ఫౌండేషన్‌లోని వృద్ధులతో వ్యక్తిగతంగా సమావేశమై వారితో ముచ్చటించారు. తేజ్ నిరంతరం దాతృత్వ ప్రయత్నాలలో ముందుంటాడు. ఇంతకుముందు, అతను అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టాడు. చాలా మందితో ఆశీర్వాదాలను పొందాడు.

2019లో సాయి దుర్ఘ తేజ్ పుట్టినరోజున అమ్మ అనాథ శరణాలయానికి కొత్త భవనాన్ని నిర్మిస్తానని హృదయపూర్వకంగా హామీ ఇచ్చారు. తన మాటను నిజం చేస్తూ, అతను 2021 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అంతేకాకుండా అతను దాదాపు మూడు సంవత్సరాల పాటు అనాథాశ్రమాన్ని దత్తత తీసుకున్నాడు. అన్ని సంబంధిత ఖర్చులను కవర్ చేశాడు. అప్పుడప్పుడు వారి దగ్గరికెళ్లి పరామర్శించి గొప్ప మనసు చాటుకున్నాడు.
ఇదెలా ఉంటే.. విరూపాక్ష చిత్రంతో సాయి దుర్ఘ తేజ్ కు ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసిన ఈ మూవీ తేజ్‌కు బాగా కలిసి వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ హీరో రోహిత్ రెడ్డి దర్శకత్వంలో 'ఎస్‌డీటీ-18' చిత్రంలో నటిస్తున్నాడు. దీన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి అత్యంత బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వసంత అనే రోల్‌లో నటిస్తుందని తెలిపారు. ఈ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











