అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!

కోలీవుడ్ స్టేట్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో సూర్య ఒకరు. రజినీకాంత్ కమల్ హాసన్ తరువాత తెలుగులో కూడా అతను అత్యదిక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక సూర్యకున్న ఫ్యాన్ ఫాలోవర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ లో అయితే సూర్య ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య సినిమా సినిమాకు మరింత ఎక్కువవుతోంది. ఇక ఇటీవల సూర్య అభిమాని పెళ్లికి వెళ్లి అందరికి షాక్ ఇచ్చాడు.

Recommended Video

Suriya Surprises His Big Fan At His Wedding, Video Viral | Filmibeat Telugu
 ట్రస్టు ద్వారా అమ్మాయిలకు ఉచిత విద్య

ట్రస్టు ద్వారా అమ్మాయిలకు ఉచిత విద్య

స్టార్ హీరో సూర్య కేవలం సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సామాజిక సేవలతో కూడా జనాలను ఆకర్షిస్తుంటాడు. ప్రత్యేకంగా అగారం ట్రస్టును స్థాపించి పెదవాళ్లకు సహాయం చేస్తున్నాడు. ట్రస్టు ద్వారా ఎక్కువగా పేద విద్యార్థినిలకు అన్ని విధాలుగా ఉన్నత విద్యను అందిస్తున్నారు.

కష్టాల్లో ఉన్నారని తెలిస్తే..

కష్టాల్లో ఉన్నారని తెలిస్తే..

ఇక అభిమానులు సూర్యను ఎంతగా ఇష్టపడతారో అదే తరహాలో సూర్య కూడా వారిపై ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అభిమానులు ఎవరు తనను కలవడానికి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా వారిని కలుసుకోవాడానికి ఇష్టపడతారు. అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వీలైనంత వరకు వారి కష్టాన్ని తీర్చేందుకు సహాయపడుతుంటాడు.

సూర్యను కూడా పిలవాలని..

సూర్యను కూడా పిలవాలని..

ఇక ఇటీవల సూర్య తన సీనియర్ అభిమానికి పెళ్లి రోజే మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎప్పటి నుంచో సూర్యకు వీరాభిమానిగా కొనసాగుతున్న హరి ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ లో కీలక మెంబర్ కూడా. అయితే కుర్రాడు ఇటీవల పెళ్లికి సిద్ధమయ్యాడు. సూర్యను కూడా పిలవాలని ముందే అనుకున్నారట. కానీ షూటింగ్స్ వలన బిజీగా ఉన్నారని మేనేజర్ చెప్పడంతో లైట్ తీసుకున్నారట.

 సర్ ప్రైజ్ ఇచ్చిన సూర్య

సర్ ప్రైజ్ ఇచ్చిన సూర్య

తనకు ఇష్టమైన హీరో పెళ్లికి వస్తాడని నమ్మకంతో లేని అభిమానికి సడన్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు సూర్య. పెళ్లి పెద్దగా వచ్చి తాళి బొట్టును తన చేతుల మీదుగా అందించి వధూవరులను ఆశీర్వదించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూర్య రాకతో ఒక్కసారిగా కళ్యాణ్ మండపం అభిమానులతో నిండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X