గర్భంలో ఉన్నప్పుడే కలుసుకున్నాం.. పునీత్‌ సమాధిని చూసి ఏడ్చేసిన హీరో సూర్య.. (వీడియో)

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గత శుక్రవారం(అక్టోబర్‌ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఆయన సమాధిని సందర్శించిన సూర్య ఏడ్చేశారు ఆ వివరాల్లోకి వెళితే

అప్పుడు రాలేని వారంతా

అప్పుడు రాలేని వారంతా

ఇక ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. కానీ తమిళ పరిశ్రమ నుంచి ఒక్క శరత్‌ కుమార్‌ మాత్రమే ఆయన అంత్యక్రియలకు హజరయ్యారు. అప్పుడు ఎందుకు రాలేదో తెలియదు కానీ ఇప్పుడు వరుసగా తమిళ హీరోలు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

పునీత్‌ సమాధిని

పునీత్‌ సమాధిని

తాజాగా నేడు పునీత్‌ సమాధిని హీరో సూర్య సందర్శించారు. అనంతరం ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా పునీత్‌ సమాధి దగ్గర ఆయనకు నివాళులు అర్పించిన సూర్య. కన్నీటి పర్యంతం అయ్యారు. పునీత్‌ తో తన అనుబంధాన్ని తలచుకుంటూ సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాయల్‌ దేవ్‌రాజ్‌ అనే నటుడు తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

ఏడ్చేసిన సూర్య

బెంగళూరులోని కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ స్మారకం వద్ద సూర్య, నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రభు, రాజశేఖర్‌ పాండియన్‌ ఆయనకు నివాళులర్పించారు. పునీత్ స్మారకం వద్ద సూర్య ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్య, పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బెంగళూరు వెళ్లి

బెంగళూరు వెళ్లి

సూర్య, SR ప్రభు మరియు రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను కలవడానికి బెంగళూరు వెళ్లారు. అనంతరం శివరాజ్‌కుమార్‌తో కలిసి కంఠీరవ స్టూడియోస్‌కు వెళ్లి పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించారు. సూర్య తన స్మారక చిహ్నం వద్ద ఏడుస్తున్నట్లు వీడియో హల్చల్ చేస్తోంది.

మా అమ్మ గర్భంలో నుంచే కలుసుకున్నాం

మా అమ్మ గర్భంలో నుంచే కలుసుకున్నాం

ఇక మీడియాతో సూర్య మాట్లాడుతూ, "ఇది చాలా అన్యాయం, జరగకూడనిది, జరిగినదాన్ని నేను ఇప్పటికీ అంగీకరించలేక పోతున్నాను, నా కుటుంబం అన్న శివరాజ్‌కుమార్ కి మంచి సంబంధాలు ఉన్నాయి అని అన్నారు. పునీత్ మరియు నేను మా అమ్మలు గర్భవతిగా ఉన్నప్పుడు మొదటిసారి కలుసుకున్నాముని, మా అమ్మ నాతో నాలుగు నెలల గర్భవతి, పునీత్ తల్లి అతనితో ఏడు నెలల గర్భవతిగా ఉన్నారని ఇది మా మొదటి సమావేశం అనే విషయాన్ని అమ్మ నాతో పంచుకుందని అన్నారు.

ప్రగాఢ సానుభూతి

ప్రగాఢ సానుభూతి

పునీత్ మరణాన్ని వారు కూడా అంగీకరించలేదని అన్నారు. ఇక అన్ని ఫోటోలు మరియు వీడియోలలో పునీత్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడని అన్నారు. పునీత్ తన జీవితంలో చేసిన అన్ని మంచి పనుల గురించి మాత్రమే విన్నానని, ఒక్క చెడ్డ మాట కూడా ఆయన గురించి వినలేదని అన్నారు. ఆయన కుటుంబానికి, ఆయన కుమార్తెలకు, అభిమానులకు మరియు కన్నడిగులందరికీ మరింత బలం చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. నేను ఆయనను తీవ్రంగా మిస్ అవుతానని పేర్కొన్న ఆయన పునీత్ కుటుంబానికి నా ప్రార్థనలు మరియు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X