క్రేజీ హీరోతో వరుస విజయాల దర్శకుడు!
తమిళ దర్శకుడు శివ గత ఐదేళ్లలో నాలుగు చిత్రాలు తెరక్కించారు. నాలుగు సినిమాలూ హీరో తలా అజిత్ తో చేసినవే కావడం విశేషం. వీరి కాంబినేషన్ లో హిట్స్ మీద హిట్స్ పడుతుండడంతో ఫాన్స్ కు కూడా బోర్ కొట్టలేదు. రీసెంట్ గా విడుదలైన విశ్వాసం చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎట్టకేలకు శివ అజిత్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రం మరో క్రేజీ హీరోతో రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న సూర్యతో శివ కొత్త చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివ సూర్యని కలసి ఓ కథని వినిపించాడట. సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ఎన్‌జికె తో పాటు కెవి ఆనంద్ దర్శత్వంలో కప్పాన్ చిత్రంలోనటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక శివ దర్శత్వంలో చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు శివ తెలుగులో శంఖం, శౌర్యం లాంటి చిత్రాలని రూపొందించాడు. విశ్వాసం చిత్రం తమిళంలో సంక్రాంతికి విడుదలయింది. తెలుగులో మాత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. మరోవైపు దర్శకుడు శివ ఇళయదళపతి విజయ్ తో కూడా ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











