అభిమానుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసిన సూర్య.. అందుకే అతనంటే పడి చచ్చేది
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ వార్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అక్కడ స్టార్ హీరోలందరికి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇక హీరోలు కూడా అభిమానులను అంతే ప్రేమతో ఇష్టపడతారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు సహాయం చేసేందుకు ట్రై చేస్తారు. ఇక కార్తీ సూర్య కూడా ఇటీవల డైరెక్ట్ గా అభిమానుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

అభిమానులపై హీరోల ప్రేమ
కేవలం సినిమాలు హిట్టయినంత మాత్రాన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగదు. అభిమానులను గౌరవించే హీరోలకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనేది తమిళ హీరోలను చూస్తేనే అర్ధమవుతుంది. ఇక సూర్య కూడా తనను ఇష్టపడే ఫ్యాన్స్ కు అదే తరహాలో లైక్ చేస్తూ ఉంటాడు.

ఎవరైనా మరణిస్తే..
సూర్య ఫ్యాన్స్ ను ఎంతగా లైక్ చేస్తాడు అంటే.. ఎవరైనా కాళ్ల మీద పడడానికి వస్తే తిరిగి అదే తరహాలో రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. గతంలో అలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. ఇక అభిమానులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ చూపులకు కూడా వెళుతుంటారు. అంతే కాకుండా మరణించిన వ్యక్తి కుటుంబాలకు అండగా ఉంటారు. గతంలో కార్తీ ఓ అభిమానిని అంత్యక్రియలకు హాజరైన విషయం తెలిసిందే.

వారి కోసం సహాయం
ఇక ఇటీవల కార్తీ - సూర్య వారి అభిమానుల కోసం మరోసారి అండగా నిలిచారు. ఫ్యాన్స్ క్లబ్ లో ఉన్న 250 మంది పేద అభిమానులు ఉపాధి లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారికి సహాయం చేసేందుకు వివరాలు మొత్తం సేకరించారు.

అభిమానుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు
దాదాపు 12.5లక్షలు విరాళంగా ప్రకటించి ఒక్కొక్కరికి రూ.5000ల చొప్పున బ్యాంక్ ఖాతాలో వేసినట్లు సమాచారం. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా మరింత సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తామని అభిమానుల లీడర్లకు కూడా చెప్పారట. అభిమానుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే తమకు తెలియజేయాలని ఈ బ్రదర్స్ క్లబ్ మెంబర్స్ కు తెలియజేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











