Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్తో పోటీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. సినిమా వాయిదా!
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కాప్పాన్. సూర్య హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అయాన్, బ్రదర్స్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీనితో కాప్పన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉత్కంఠ భరితంగా చిత్రాలు తెరకెక్కించడంలో కెవి ఆనంద్ సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో మోహన్ లాల్, హీరో ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాప్పాన్ చిత్రంలో సూర్య ప్రధానమంత్రి సెక్యూరిటీ అధికారి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాప్పాన్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో కూడా అదే రోజున విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
దీనితో కాప్పాన్ చిత్ర యూనిట్ సాహో చిత్రంతో పోటీ మంచిది కాదని భావించింది. దీనితో కాప్పాన్ చిత్రాన్ని ఆగష్టు 30న విడుదలచేసేందుకు ఆ చిత్ర నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. సూర్య ఈ చిత్రంలో వివిధ గెటప్పులలో కనిపించనున్నాడు. సీక్రెట్ మిషన్ ద్వారా టెర్రరిస్టులని మట్టుబెట్టే పాత్రలో సూర్య నటిస్తున్నాడు.