చందమామతో హిట్ కొట్టాలనుకుంటోన్న సూర్య

విలక్షణ నటుడు సూర్య కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా సాగుతూ తనకంటూ ఓ ఫ్యాన్స్ బేస్ ను ఏర్పరచుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూర్య క్రమంగా పర్ఫార్మెన్స్ కు పెద్ద పీట వేస్తూ, నందా, పితామగన్, కాఖ్క కాఖ్క, వానరస్ అయిరమ్ వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. త్వరలోనే సూరారై పోత్రు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అక్టోబర్ 30న ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల కానున్న ఈ సినిమా ఆకాశమే హద్దుగా తెలుగువారిని అలరించబోతోంది.

కొంతకాలంగా సూర్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న వైనం తెలిసిందే. NGK, బందోబస్త్ సినిమాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయి. ఇక ఇదంతా పక్కన పెడితే, తన నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్న సూర్య, కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ బ్రదర్స్ అనే సినిమాలో కలసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ జోడీ కడుతుండటంతో అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Suriya’s Lucky Charm, Kajal in his next

లక్కీ చార్మ్ గా పేరుగాంచిన కాజల్ అగర్వాల్ రాకతో సూర్య ఫ్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు సింగం డైరెక్టర్ హరి దర్శకత్వంలో అరువ అనే సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X