కమల్ తరువాత సూర్యకే సాధ్యం... ఇన్స్టాలో తారల హవా.
బాక్సాఫీస్ వద్ద స్టడీగా కొనసాగుతూ, విలక్షణమైన నటనతో తమిళ తంబిల మనసులు చూరగొంటున్న సూర్య పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 23 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చిన సూర్యకు అదే రేంజ్ లో ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్న సూర్య, ఓ విషయంలో కమల్ హాసన్ తరువాత తానే అని నిరూపించుకున్నాడు.
తకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన సూర్య, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలకన్నా కాస్త లేటుగా 2015లో ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య అతి తక్కువ కాలంలోనే 60లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఐదేళ్ల వ్యవధిలోనే సూర్య ఈ మార్క్ ను దాటేయడం విశేషం.

అయితే సూర్యకన్నా ముందు కమల్ హాసన్, అతితక్కువ కాలంలో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న స్టార్ గా పేరుగాంచాడు. తాజా రికార్డ్ తో ఇప్పుడు సూర్య అతడి సరసకు చేరినట్లేనని తెలుస్తోంది. ఏమైనా, సూర్య దక్కించుకున్న ఘనతపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాష్ టాగ్ 6 మిలియన్ లవ్ ఫర్ సూర్య ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చింది. మరోవైపు సూర్య ఆరువ, వాడివాసల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











