10 డిజాస్టర్లు.. డిమాండ్ తగ్గని సూర్య.. రికార్డు రెమ్యునరేషన్, ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?
కరుడుగట్టిన మూవీ లవర్స్ కి బాగా బాధ కలిగించే కొన్ని అంశాల్లో తాము చూసిన అన్నేళ్ల సినిమాలో ఒకప్పటి హీరోలు, దర్శకులు తమ ఫామ్ ని కోల్పోయి మళ్ళీ ఒక హిట్ కొట్టేందుకు పడే స్ట్రగుల్ ఒకటని చెప్పవచ్చు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు ఇపుడు తరం కంటే ముందే ఇండియన్ సినిమా దగ్గర చేసిన దర్శక హీరోలు ఇపుడు సరైన హిట్ లేక నెగిటివ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. 10 కిపైగా డిజాస్టర్లతో కొనసాగుతున్న సూర్యకు మాత్రం మార్కెట్ పరంగా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదట. ఆ వివరాల్లోకి వెళితే..
కాగా అలాంటి వారిలో ఎక్కువగా తమిళ నటులు దర్శకులే కనిపిస్తారని చెప్పవచ్చు. కాగా ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా స్టార్ నటుడు సూర్య చేరడం జరిగింది. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే సూర్య ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో వైవిధ్యభరిత సినిమాలు చేసి ఎప్పుడో తెలుగు మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు అందుకున్నాడు. ఇలా తెలుగులో కూడా మంచి ఫేమ్ ని అప్పట్లో రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత తనకే ఉండేలా చూసుకున్నాడు.

అలాంటి సూర్య ఇపుడు ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాను నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో నేరుగా ఓటిటిలో వచ్చినవి మినహా థియేటర్స్ లో వచ్చినవి బాగా డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో అయినా సూర్య హిట్ కొడతాడని చాలా మంది అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా చివరికి నిరాశే మిగిల్చింది.
కాగా ఈ సినిమా సరైన టాక్ అందుకోకపోయినప్పటికీ కూడా సూర్య డిమాండ్ మాత్రం మామూలుగా లేదని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా సూర్య హీరోగా నెక్స్ట్ మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తూ ప్రామిసింగ్ దర్శకునిగా మారిపోగా ఇపుడు వీరి కలయికలో చేయనున్న సినిమా కోసమే క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.
కాగా ఈ చిత్రానికి ఆల్రెడీ భారీ ఓటిటి డీల్ పూర్తయ్యిపోయిందట. ఏకంగా ఈ సినిమా OTT హక్కులు 80 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా ఈ సినిమాని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనేశారట. ఇక మరో రూమర్ గా సూర్య ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టుగా కూడా వినిపిస్తుంది. కాగా వీటి ప్రకారం అయితే సూర్య ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇన్ని ప్లాప్ లు వస్తున్నా కూడా సూర్య ఈ రేంజ్ లో తీసుకోవడం అనేది ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక సూర్య నటించిన తాజా చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే నటించగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. అలాగే వెంకీ అట్లూరితో సినిమా ఈ మే చివరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











