NGK ఫెయిల్యూర్‌పై స్పందించిన హీరో సూర్య

Recommended Video

Suriya Responds On NGK Movie Failure || Filmibeat Telugu

సౌత్ స్టార్ సూర్య నటించిన NGK మూవీ తెలుగుతో పాటు తమిళంలో మే 31న విడుదలైంది. అయితే రెండు ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి నెగెటివ్ రెస్సాన్సే రావడంతో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ ఫలితాలపై తాజాగా సూర్య స్పందించారు.

సినిమా ఫెయిల్యూర్‌ను స్వీకరిస్తూ సూర్య ట్వీట్ చేశారు. 'NGK సినిమా విషయంలో అందరి అభిప్రాయాలను వినయంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సినిమా లోపాలను ఎత్తి చూపడంతో పాటు, డిఫరెంట్ అటెమ్ట్ చేసినందుకు ప్రశంసించిన మాస్టర్ మైండ్స్(క్రిటిక్స్)కు ఈ సందర్భంగా సూర్య థాంక్స్ చెప్పారు.

నిజాయితీగా ఒప్పుకున్న సూర్యపై ప్రశంసలు

నిజాయితీగా ఒప్పుకున్న సూర్యపై ప్రశంసలు

ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, టెక్నీషియన్లకు, దర్శకుడు సెల్వరాఘవన్, నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు సూర్య కృతజ్ఞలు తెలిపారు. సినిమా ప్లాప్ అయిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్న సూర్యపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఎంత వసూలు చేసింది?

ఎంత వసూలు చేసింది?

NGK మూవీ తమిళనాడు బాక్సాఫీసు వద్ద తొలి 5 రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే నెగెటివ్ టాక్ కారణంగా తొలి వారంలోనే బిజినెస్ క్లోజ్ అయింది. ఇది లాస్ వెంచర్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. ఇక తెలుగు నాట సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని థియేటర్ల నుంచి ఎత్తేశారు.

సెల్వరాఘవన్ కెరీర్ మీద ఎఫెక్ట్

సెల్వరాఘవన్ కెరీర్ మీద ఎఫెక్ట్

దర్శకుడు సెల్వరాఘవన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఎన్టీకె'. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో అతడి కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకప్పుడు 7జి బృందావన్ కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు... 2013లో ‘వర్ణ' పేరుతో భారీ బడ్జెట్ మూవీ తీశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి తీసిన ఈ మూవీ తీవ్రమైన నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.

‘కాప్పన్' మూవీపై సూర్య అభిమానుల ఆశలు

‘కాప్పన్' మూవీపై సూర్య అభిమానుల ఆశలు

ఇక సూర్య అభిమానులు త్వరలో రాబోతున్న ‘కాప్పన్' మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 30న విడుదల కాబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈమూవీలో సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య ఎస్పీజీ కమెండోగా, మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, పిఎం కొడుకు పాత్రలో ఆర్య నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X