'నిన్ను కాపాడే వాడే ఇంకొకడిని చంపుతాడు'.. ఉత్కంఠ రేపుతున్న సూర్య సినిమా!
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకడు. సూర్య చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాయి. సింగం లాంటి మాస్ చిత్రాలు చేస్తూనే సూర్య క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటాడు. సూర్య ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్సకత్వంలో ఎన్ జికె చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు తనకు అచొచ్చిన దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య 37వ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ తారాగణం, బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నూతన సంవత్సర కానుకగా అర్థరాత్రి అంటే జనవరి 1, 12 గంటలకు సూర్య 37వ చిత్ర టైటిల్ విడుదల చేయబోతున్నట్లు ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్ సూర్య సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 'నిన్ను కాపాడే వాడే ఇంకొకరిని చంపుతాడు' అనే లైన్ ఈ పోస్టర్ లో ఉంది. ఈ పోస్టర్ లో తుపాకిని చూపిస్తున్నారు. ఈ చిత్రం కూడా యాక్షన్ అభిమానులకు పండగలా కనిపిస్తోంది.

కెవి ఆనంద్, సూర్య కాంబినేషన్లో గతంలో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మోహన్ లాల్, హీరో ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయేషా సైగల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











