హీరోయిన్ మీనాక్షి చౌదరిపై సుశాంత్ కామెంట్స్ వైరల్
సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. చిలసౌ వంటి కూల్ హిట్ తరువాత సోలో హీరోగా రాబోతోన్న చిత్రమిదే. మధ్యలో అల వైకుంఠపురుములో సినిమా చేసినా కూడా సుశాంత్‌కు చిన్న పాత్రే దక్కింది. కానీ ఆ సినిమాతో సుశాంత్ లుక్స్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలా ఇప్పుడు సుశాంత్ సోలో హీరోగా వస్తోన్న ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్లు, సాంగ్‌తో మంచి హైప్ క్రియేట్అయింది. పండుగ స్పెషల్‌గా వదులుతున్న పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సుశాంత్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ఫన్నీ కామెంట్లు చేశాడు. షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న సంఘటనల గురించి సుశాంత్ చెప్పుకొచ్చాడు.

మేం (నేను, దర్శకుడు) ఓ సీన్ గురించి ఎంతో చర్చించుకుంటున్నాం. కానీ మధ్యలో మా కో స్టార్ (మీనాక్షి చౌదరి) మాత్రం ఇలా చేస్తోంది. కోతి చేష్టలు చేస్తోందంటూ సుశాంత్ కౌంటర్ వేసేశాడు. దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ.. నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి సెట్స్ మీద ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నట్టున్నారు. ఈ చిత్రానికి దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











