Sushant Singh Rajput death anniversary.. మరణానికి ముందు సుశాంత్‌తో అలాంటి ఫోటోలు.. రియా చక్రవర్తి ఫోటోలు వైరల

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని వీడి జూన్ 14వ తేదీకి రెండేళ్లు అయింది. సుశాంత్ ఆకస్మిక మరణం ఇప్పటికీ అభిమానులను తీవ్ర విషాదానికి గురిచేస్తున్నది. సుశాంత్‌ను రెండో వర్ధంతి రోజున సినీ అభిమానులు, బాలీవుడ్ తారలు గుర్తు చేసుకొని ఘనంగా నివాళి అర్పించారు. అయితే సుశాంత్ మరణంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద నటి, సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి షేర్ చేసిన పోస్టు వైరల్ అయింది. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన రియా చక్రవర్తి గురించి వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహజీవనం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహజీవనం


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, రియా చక్రవర్తి సహజీవనం చేస్తూ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వారిద్దరూ ముంబైలోని విలాసవంతమైన భవనంలో వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే సుశాంత్ మరణానికి కొద్ద రోజుల ముందు వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సుశాంత్ వదిలేసి ఆమె తన నివాసానికి మకాం మార్చింది.

బాంద్రాలో సుశాంత్ సూసైడ్

బాంద్రాలో సుశాంత్ సూసైడ్


రియా చక్రవర్తి‌తో బ్రేకప్ జరిగిన కొద్ది రోజులకే సుశాంత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం బాలీవుడ్ సంచలనం రేపింది. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాని తన నివాసం సూసైడ్ చేసుకొన్నారనే వార్తలు హిందీ సినిమా పరిశ్రమను కుదిపేసింది. సుశాంత్ మరణం తర్వాత అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

 ఈడీ, సీబీఐ రంగంలోకి

ఈడీ, సీబీఐ రంగంలోకి


సుశాంత్ మరణం తర్వాత ఆయనను డ్రగ్స్‌కు బానిస చేశారని, అలాగే భారీ మొత్తంలో అకౌంట్ల నుంచి డబ్బు దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. దర్యాప్తు దశలో అనేక మార్లు విచారించిన అనంతరం రియా చక్రవర్తితోపాటు తన సోదరుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఆమె జైలు నుంచి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.

ప్రతీ రోజు నిన్ను మిస్ అవుతున్నా

ప్రతీ రోజు నిన్ను మిస్ అవుతున్నా


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెండో వర్ధంతిని పురస్కరించుకొని రియా చక్రవర్తి ఎమోషనల్ అయ్యారు. నిన్ను ప్రతీ రోజు మిస్ అవుతున్నాను అంటూ ఇప్పటి వరకు బయటకు రాని నాలుగు ఫోటోలు తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒక ఫోటోలో సుశాంత్ బుగ్గలపై ముద్దులు పెట్టుకొంటూ కనిపించింది. ఆ ఫొటోలో రియాతో సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఇంధ్రధనుసు సాక్షిగా

ఇంధ్రధనుసు సాక్షిగా


రియా చక్రవర్తి షేర్ చేసిన మిగితా ఫోటోల్లో సుశాంత్‌తో చాలా సన్నిహితంగా కనిపించింది. సున్నితమైన రొమాన్స్‌ చేస్తూ రియా చక్రవర్తి కనిపించింది. ఓ ఫోటోలో రియాను తన చేతులతో ఎత్తుకొని కౌగిలించుకొన్నారు. ఒక ఫోటోలో ఆకాశంలో మెరిసిన ఇంద్రధనుస్సును చూపిస్తూ రియా తన్మయత్వంతో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X