హీరో లైంగికంగా వేధించాడా? హీరోయిన్‌తో వాట్సఫ్ చాట్ లీక్
దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు సైతం ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం అతడు 'కిజ్జి ఔర్ మన్నీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తన కోస్టార్ సంజన సంఘీతో సుశాంత్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడని, సెక్సువల్ వేధింపులకు పాల్పడ్డట్లు కొన్ని నెలల క్రితం ఆరోపణలు వచ్చాయి. తాజాగా #మీటూ ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరోసారి సుశాంత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలతో హర్టయిన సుశాంత్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నేను అలాంటోన్ని కాదు
సంజన సంఘీని సుశాంత్ లైంగికంగా వేధించినట్లు వచ్చిన వార్తలను దర్శకుడు ముఖేష్ ఛాబ్రా గతంలోనే ఖండించారు. తాజాగా మరోసారి మీటూ కాంపెయిన్లో తన పేరు రావడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రియాక్ట్ అయ్యారు. తాను అలాంటి వ్యక్తి కాదు అని తెలిపారు.
తనపై పడ్డ మరకను తొలగించుకునేందుకు
అయితే తనపై పడ్డ ఈ ఆరోపణల మరకను తొలగించుకునేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఏకంగా సంజనతో జరిగిన వాట్సాఫ్ చాటింగ్ వివరాలు బయట పెట్టారు. సినిమా మొదలైన తొలి రోజు నుంచి సినిమా పూర్తయ్యే చివరి రోజు వరకు తమ మధ్య జరిగిన కన్వర్జేషన్ స్వయంగా అతడే లీక్ చేశాడు.
ఇది చాలా పర్సనల్... బాధగా ఉంది కానీ తప్పడం లేదు
పర్సనల్ విషయాలు ఇలా పబ్లిక్‌లో పెడుతున్నందుకు బాధగా ఉంది. కానీ తప్పడం లేదు అంటూ సుశాంత్ వెల్లడించారు. ఇంతకు మించి తనకు మరో దారి కనిపించలేదని వెల్లడించారు.

నోరు మొదపని సంజన
అయితే ఈ విషయంలో హీరోయిన్ సంజన సంఘీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సుశాంత్ తనను లైంగికంగా వేధించాడనే ఆరోపణలను ఆమె ఖండించలేదు. అతడికి మద్దతుగా సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.


Click it and Unblock the Notifications











