For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sushant Singh Rajput చనిపోయే నాటికి.. రెమ్యునరేషన్ ఎంత.. ఆస్తులు విలువ ఏ మేరకు అంటే!

  |

  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కోట్లాది మంది అభిమానులను, సినీ ప్రేక్షకులను, ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణించి జూన్ 14వ తేదీకి ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ మహా విషాదం నుంచి సాధారణ ప్రజలు తెరుకోలేకపోతున్నారు. ఆయన ఆకస్మిక మృతికి లక్షలాది మంది నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ సింగ్‌కు వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని అంశాలు మీ కోసం..

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెమ్యునరేషన్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెమ్యునరేషన్

  స్వయంకృషితో ఎదుగుతూ వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరుస విజయాలను అందుకొన్నారు. ఎంఎస్ ధోని, చిచ్చోరే, రాబ్తా లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఫిదా చేశాయి. అలా విజయోత్సాహాంతో ముందుకెళ్తున్న సుశాంత్ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రాలు కొన్ని కారణాల చేజారాయి. అయితే తన చివరి సినిమా వరకు ప్రతీ మూవీకి సుమారు 7 కోట్ల రెమ్యునరేషన్ ఆయన అందుకొన్నారనేది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  ఖగోళశాస్త్రం, టెలిస్కోపులపై మక్కువ

  ఖగోళశాస్త్రం, టెలిస్కోపులపై మక్కువ

  ఇంజనీరింగ్ చదువుకొన్న సుశాంత్ సింగ్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళ శాస్త్రమంటే మక్కువ. అందుకోసం తన ఫ్లాట్‌లో భారీ, అత్యంత ఖరీదైన టెలిస్కోప్స్ వినియోగించేవారు. Meade 14 LX600 లాంటి ఖరీదైన టెలిస్కోప్‌తో తనకు సమయం ఉన్నప్పుుడల్లా సౌర కుటుంబాన్ని, చంద్రుడిని వీక్షిస్తూ పరిశోధనలు చేసేవారు. అలాగే చంద్రమండలంపై నివసించడానికి భూమిని కూడా కొనుగోలు చేయడం విశేషం.

  ఖరీదైన వాహనాలంటే

  ఖరీదైన వాహనాలంటే

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖరీదైన మోటర్ వాహనాలు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద అత్యంత ఖరీదైన BMW K 1300 R ఉండేది. అలాగే మెసెరాటీ క్వాట్రోపోర్టే, ల్యాండ్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ వాహనాలు ఉండేవి. అత్యంత విలాసవంతమైన కార్ల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవారని సన్నిహితులు చెప్పుకొనే వారు.

  150 కోరికల చిట్టాలో బోయింగ్ 737

  150 కోరికల చిట్టాలో బోయింగ్ 737

  ఇక సుశాంత్ సింగ్‌కు ఆకాశాన మార్గన ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని తన 150 కోరికల చిట్టాలో ప్రత్యేకంగా రాసుకొన్నారు. విమానాలను నడిపేందుకు నేను లైసెన్స్ తీసుకోవాలనుకొంటున్నాను. వీలైతే బోయింగ్ 737 ఫిక్స్‌డ్ బేస్ ఫ్లయిట్ సిమ్యులేటర్‌ను కొనుక్కోవాలని అనుకొంటున్నాను అని సుశాంత్ కలలు కనేవారని స్నేహితులు వెల్లడించారు.

  సుశాంత్ మరణించే నాటికి ఆస్తుల విలువ

  సుశాంత్ మరణించే నాటికి ఆస్తుల విలువ

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కెరీర్‌ను అత్యంత అద్భుతంగా ప్లాన్ చేసుకొంటూ వెళ్లారనేది ఆయన నటించిన సినిమాలు చేస్తే అర్ధమవుతుంది. తన కెరీర్‌ను 2013లో కాయ్ పో చే అనే చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత శుద్ద్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి, వెలకమ్ టూ న్యూయార్క్, కేదారినాథ్, డ్రైవ్, దిల్ బేచారా చిత్రాల్లో నటించారు. తాను చనిపోయే వరకు సుశాంత్ సంపద 59 కోట్ల రూపాయలని మీడియా లెక్కకట్టింది.

  English summary
  Bollywood actor Sushant Singh Rajput died on June 14th at Mumbai in suspicious circumstances. June 14th, 2021 is his first death anniversary. In this occassion, His remuneration, assets Net Worth become highly discussion topic. Please follow Telugu filmibeat to more stories.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X