నా ఫస్ట్ హీరోయిన్ ఇప్పుడు చెల్లి అయిపోయింది.. సుశాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో పెద్ద కుంటుంబంలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత చాలా మంది హీరోలుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వారిలో సుశాంత్ ఒకరు. హీరోగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన సుశాంత్ కొన్ని హిట్ సినిమాలు చేసినప్పటికీ లాంగ్ రన్ లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అల వైకుంఠపురములో, రావణాసుర వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. భోళా శంకర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్' (Bhola Shankar). తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇందులో మిల్కీ బ్యూటి తమన్నా భాటియా, మహానటి కీర్తి సురేష్, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

Sushanth About Tamanna Sister Role In Bhola Shankar

భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 6న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. సినిమా టీమ్ పలు ఇంటర్వ్యూలతో హైప్ పెంచుతున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సుశాంత్ ఆసక్తిర కామెంట్స్ చేశాడు.

"యాక్టింగ్ కెరీర్ విషయంలో నేను ఏది ప్లాన్ చేయలేదు. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలా అన్నీ నాకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ, త్రివిక్రమ్ తో కలిసి పని చేశాను. వాళ్ల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. చాలా కొత్తగా చూపించారు. అలాగే రావణాసుర సినిమాలో కూడా డిఫరెంట్ గా చూపించారు" అని సుశాంత్ తెలిపాడు.

"చిరంజీవితో పని చేయాలని నాకు చాలా ఎగ్జయిటింగ్ ఉండేది. చిన్నప్పటీ నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకు అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడు సార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ గారు కాల్ చేసి భోళా శంకర్ గురించి చెప్పారు. చాలా నచ్చింది" అని సుశాంత్ పేర్కొన్నాడు.

"భోళా శంకర్ లో ఒక సాంగ్ కూడా ఉంటుందని మెహర్ రమేష్ గారు చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. భోళా శంకర్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే మూవీ. ఇందులో నాది కేమియో రోల్. నా పాత్ర చాలా ఛార్మింగ్ గా ఉంటుంది" అని సుశాంత్ వివరించాడు.

"చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాతో నాకు ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయి. సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా (కాళిదాసు 2008) హీరోయిన్ తమన్నా. భోళా శంకర్ లో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేష్ తో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో మా కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వచ్చింది. అది మీకు తెరపై కనిపిస్తుంది. మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం" అని తమన్నాకు బ్రదర్ రోల్ గురించి తెలిపాడు సుశాంత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X