డబ్బింగ్ కూడా అయిపోయిందట..స్పీడు మీదున్న సుశాంత్
సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. చిలసౌ సినిమా వంటి కూల్ హిట్ తరువాత మళ్లీ సోలో హీరోగా రాలేకపోయాడు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ను పోషించాడు. అయితే అది బాగానే కలిసి వచ్చింది. చిన్న పాత్రే అయినా కూడా సుశాంత్ లుక్, మేకోవర్‌ను మార్చేసింది. మొత్తంగా సుశాంత్ కెరీర్‌కు అల వైకుంఠపురములో కలిసి వచ్చింది.
అలా తన తదుపరి చిత్రంగా ఇచ్చట వాహనములు నిలుపరాదు ప్రకటించాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాపై అందరికీ అంచనాలు పెంచేలా పోస్టర్లను డిజైన్ చేశారు. మామూలుగా కరోనా లేకపోతే ఈ పాటికే మరో హిట్‌ను సుశాంత్ తన ఖాతాలో వేసుకునేవాడు. కానీ లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయట. అందులో భాగంగా సుశాంత్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు వెన్నెల కిషోర్‌తో కలిసి ఉన్న సీన్‌కు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేశాడు. ఆ స్టిల్ వెనుకున్న కథ ఏంటి? అని ఆసక్తిని రేకెత్తించాడు సుశాంత్. మొత్తానికి ఈ సినిమా ఇక వేసవిలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ఎస్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











