ఫస్ట్ డే షూటింగ్.. రంగంలోకి దిగిన సుశాంత్
ప్రస్తుతం టాలీవుడ్ అంతా షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా హీరోలందరూ రంగంలోకి దిగారు.. కొందరు ఇప్పుడిప్పుడే దిగుతున్నారు. కుర్ర హీరోలైతే ఎప్పుడో షూటింగ్‌లు మొదలెట్టేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం కూడా షూటింగ్‌ను ప్రారంభించేసింది. ఇలా టాలీవుడ్ మళ్లీ బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే అక్కినేని హీరో సుశాంత్ కూడా రంగంలోకి దిగాడు.
చిలసౌ ఇచ్చిన ఎనర్జీతో మంచి ఫాంలోకి వచ్చాడు సుశాంత్. ఆ సినిమా హిట్ అవ్వడంతో సెకండ్ ఇన్నింగ్ మొదలైంది. అయితే ఈ చిత్రం వచ్చి చాలా రోజులు అవుతున్నా.. సోలో హీరోగా మరో సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురాలేకపోయాడు. అయితే మధ్యలో అల వైకుంఠపురములో చిత్రంలో సినిమాతో అందర్నీ పలకరించాడు. ఈ మూవీలో మంచి నటనను కనబర్చి అందర్నీ మెప్పించాడు.

సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే కొత్త కథతో ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అవుతున్నాడు. కరోనా, లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను నేడు మళ్లీ ప్రారంభించారు. మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది అంటూ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశాడు. ఇందులో అందరూ కలిసి ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందరూ ఫేసుకు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











