గేర్ మార్చి బండి తియ్.. ఫుల్ జోష్‌లో ఉన్న సుశాంత్
అక్కినేని హీరో సుశాంత్ సోలో హీరోగా కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలం అవుతోంది. ఇక కెరీర్ ముగిసిపోతుందా? అని అనుకునే సమయంలో చిలసౌ వంటి కూల్ హిట్ కొట్టేశాడు. అప్పటి వరకు సుశాంత్ అందించిన డిజాస్టర్లు, ఫ్లాపులు అన్నీ ఎగిరిపోయాయి. ఇక చిలసౌ ఇచ్చిన ఎనర్జీతో మంచి ఫాంలోకి వస్తారని అంతా భావించారు. కానీ మళ్లీ కెరీర్ స్లో అయింది. ఇంత వరకు మళ్లీ సోలో హీరోగా ఓ చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు అందించలేకపోయాడు.
అయితే మధ్యలో అల వైకుంఠపురములో చిత్రంలో చేసిన స్పెషల్ క్యారెక్టర్ పర్వాలేదనిపించింది. అయితే సుశాంత్‌క మాత్రం మంచి పేరు వచ్చింది. లుక్స్ పరంగా గానీ, నటన పరంగా గానీ త్రివిక్రమ్ మరో మెట్టు ఎక్కించాడు. ఇక సుశాంత్ అల వైకుంఠపురములో చిత్రం తరువాత ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే కొత్త కథతో ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అవుతున్నాడు. కరోనా, లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రం కోసం సుశాంత్ మరింత స్టైలీష్‌గా రెడీ అయ్యాడ. ఆ విషయం ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే తాజాగా మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్!!! అంటూ ఫుల్ జోష్‌లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ తాజాగా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











