మరో రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు.. ఆ రూట్లో సర్కారు వారి పాట నెంబర్ వన్ రికార్డ్!

మహేష్ బాబుతో గీతగోవిందం దర్శకుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట రోజురోజుకు మరింత అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా అభిమానులకు సరికొత్త ట్రీట్ అని చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఫస్ట్ నోటీస్ అంటూ సూపర్ స్టార్ టీమ్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన రికార్డులుల్ మోత కూడా మొదలైంది.

శనివారం మహేష్ బాబు స్టైలిష్ అల్ట్రా లుక్కుతో కనిపించిన పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లుక్కు అయితే మామూలుగా లేదని ఓ వర్గం అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఫుల్ ఫొటో పంపితే బావుండేది అని మరికొందరు అనుకున్నారు. ఏదేమైనా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ట్విట్టర్ లో అయితే ఒక బెంచ్ మార్క్ ను అందుకోవడం విశేషం.

SVP First Notice Becomes the MOST LIKED & RETWEETED Poster

ఇప్పటివరకు 24 గంటల్లో ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ పొందడమే కాకుండా అత్యధికంగా రీ ట్వీట్స్ పొందిన టాలీవుడ్ పోస్టర్ కూడా ఇదే. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు పోస్టర్ కూడా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట జోరు మొదలైంది. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక సర్కారు వారి పాట సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదట. మంచి సందేశం కూడా ఉంటుందట. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకునేలా ఉంటుందని ఇదివరకే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇక అభిమానులు కూడా అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందని నమ్మకంతో ఉన్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ అయితే మోత మొదలు పెడదమా అనే క్యాప్షన్ తో సినిమా ప్రమోషన్ ను గట్టిగానే స్టార్ట్ చేసింది. ఈ పది రోజుల్లో ఎప్పుడు ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో ఎవరు ఊహించలేరట. మేకింగ్ వీడియో కూడా వస్తుందని సమాచారం. ఇక రిలీజ్ డేట్ పై మొన్నటి వరకు ఎన్నో అనుమానాలు వచ్చాయి. సంక్రాంతికి సినిమా వస్తుందా రాదా అనేది అభిమానులను కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రూమర్స్ కు చెక్ పెడుతూ 2022 సంక్రాంతికి జనవరి 13 సినిమా రాబోతున్నట్లు పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X