సిగ్గుపడి దూరం కాలేదు.. రాజమౌళి మూవీతో బాలీవుడ్‌లో రీఎంట్రీ.. రాంచరణ్
Recommended Video
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్‌కు ముస్తాబయింది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ ప్రారంభించారు నిర్మాత రాంచరణ్. ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో సైరా మూవీ హిందీ టీజర్‌ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో తమన్నా మాట్లాడుతూ..

సైరాలో అందుకే నటించలేదని
సైరా సినిమాకు నిర్మాతగా మారినందున ఈ చిత్రంలో నటించలేకపోయాను. ఇందులో గొప్ప నటీనటులు నటిస్తున్నందున వారి టాలెంట్‌ను చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ఈ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నందున్న, ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా మారినందున్న, సినిమాను జాతీయ స్థాయికి చేర్చే ప్రయత్నంలో తెర వెనుకే ఉన్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్క గొప్ప నటుడు నా ప్రాజెక్ట్‌ను సులభంగా పూర్తయ్యేందుకు సహకరించినందుకు థ్యాంక్స్ అని రాంచరణ్ అన్నారు.

బాలీవుడ్‌కు దూరం కాలేదని
బాలీవుడ్ సినిమాలో నటించడానికి నేను సిగ్గుపడి దూరం కాలేదు. సరైన కథ లభించకపోవడం వల్లే హిందీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. సరైన కథ, ప్రాజెక్ట్ లభిస్తే బాలీవుడ్‌లో నటించడానికి రెడీగా ఉన్నాను. అంతేకాకుండా తెలుగు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హిందీపై దృష్టిపెట్టలేకపోతున్నాను అని రాంచరణ్ తెలిపారు.

RRR సినిమాతో రీ ఎంట్రీ
వచ్చే ఏడాది బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాను. రాజమౌళి రూపొందించే RRR సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులకు చేరువ అవుతాను. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆ సినిమా ద్వారా మళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తాను. దాంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాను అని రాంచరణ్ చెప్పారు.

సైరాలో నటీనటులు
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











