Syed Sohel: అప్పుడు సపోర్ట్ చేసిన మీరంతా ఎక్కడికెళ్లారు.. దండం పెడతా వచ్చి సినిమా చూడండి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో ఆయన ప్రవర్తించిన తీరుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలా వచ్చిన క్రేజ్ తోనే ఆయన సినిమాల్లోకి వచ్చారు. అదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో ఇప్పటికే చెప్పారు. అయితే తాజాగా ఆయన బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తన సినిమాపై ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి సోహెల్.. పలు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోహెల్.. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో వచ్చాడు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు. కానీ ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఎవరూ చిత్రాన్ని చూసేందుకు ముందుకు రావడం లేదు. ఇదంతా చూసిన హీరో సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. నటీనటులతో కలిసి థియేటర్ కు వెళ్లిన ఆయన కంటతడి పెట్టాడు.

Hero Syed Sohel Emotional Comments About His Fans Not Coming to Theatres to Watch BootCut Balaraju Film

ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. కుటుంబ సభ్యులు అందరితో కలిసి వచ్చి చూడాల్సిన సినిమా అని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఎలాంటి వల్గారిటీ లేదని వివరించాడు. బిగ్ బాస్ లో ఉండగా.. అంతగా సపోర్ట్ చేసిన మీరంతా ఎక్కడికి వెళ్లారు.. వచ్చి సినిమా చూడండి దండం పెడతానంటూ వేడుకున్నాడు. బిగ్ బాస్ లో ఉండగా.. సోహెల్, సోహెల్ అంటూ వేలల్లో కామెంట్లు చేసిన మీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాయలసీమతో పాటు తెలంగాణలోని థియేటర్లకు వెళ్లి నా సినిమా చూడండి అంటూ మరోసారి ప్రేక్షకులను బతిమాలాడు.

Hero Syed Sohel Emotional Comments About His Fans Not Coming to Theatres to Watch BootCut Balaraju Film

20 నిమిషాలు కూడా తన సినిమా చూడకముందే కొందరు రీవ్యూలు ఇస్తున్నారని... అదంతా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందని అన్నాడు. చాలా కష్టపడి ఈ సినిమా చేశామని.. డబ్లులు లేకపోవడం వల్లే ఈ చిత్రానికి పబ్లిసిటీ చేసుకోలేకపోయామని సోహెల్ ఆవేదనతో మాట్లాడాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే కనీసం చూసేందుకు ఆసక్తి చూపించడం లేదని.. అసలు దీనికి కారణం ఏంటో కూడా తనకు అర్థం కావట్లేదని అన్నాడు. ఈ సినిమా కనుక ఆడకపోతే నెక్స్ట్ తాను వల్గారిటీ ఉన్న సినిమాలే చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.

Hero Syed Sohel Emotional Comments About His Fans Not Coming to Theatres to Watch BootCut Balaraju Film

ప్రేక్షకులు ఎక్కువగా కిస్సింగ్ సీన్లు, లిప్ లాక్ ఉన్న వల్గర్ సినిమాలనే ఆదరిస్తారని... మరోసారి ప్రూవ్ అయిందంటూ సోహెల్ తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు. ఇదంతా ఇలా ఉండగా.. బూట్ కట్ బాలరాజు సినిమాలో సోహెల్ సరసన మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. అలాగే బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో గ్లోబ‌ల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. స‌య్యద్ సోహైల్ తో పాటు అనన్య నాగళ్ల, ఇంద్రజ, సునీల్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X