అరుదైన అవార్డును అందుకున్న సోహెల్: వాళ్లిద్దరి తర్వాత అతడితే ఘనత.. దానికి నిదర్శనం అంటూ!
చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి.. దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన అతడు.. కొన్ని సీరియళ్లలోనూ భాగం అయ్యాడు. అయినప్పటికీ పెద్దగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. అప్పటి నుంచి అతడి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోహెల్ ఓ అరుదైన అవార్డుకు ఎంపికయ్యాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

కెరీర్ మొదలైందిలా.. రెండింట్లోనూ మార్కు
వరుణ్ సందేశ్ హీరోగా చేసిన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో పాటు చిన్న సినిమాల్లోనూ నటించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో పేరు వచ్చింది.

బిగ్ బాస్ ఛాన్స్.. ఆమెతో కలిసి రహస్యంగా
వరుసగా సినిమాలు, సీరియళ్లతో బిజీగా గడుపుతోన్న సోహెల్‌కు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, అందరిలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ రెండు రోజుల పాటు రచ్చ రచ్చ చేసిన అతడు.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వెళ్లడమే గొడవ మొదలెట్టాడు. అలానే ప్రేక్షకుల దృష్టిలో పడిపోయాడు.

అద్భుతమైన ఆట... ఫినాలేలో అడుగుపెట్టి
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు సోహెల్. ఇందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ టాస్క్ అయినా తానే నెంబర్ వన్ అనేలా ఆడుతూ వచ్చాడు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్లతో గొడవలు పడుతూ విమర్శల పాలయ్యాడు. మొత్తానికి ప్రేక్షకుల మద్దతులో ఫినాలేలో అడుగు పెట్టాడతను.

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ కంటెస్టెంట్ సోహెల్
గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. తద్వారా ఇలా షో చరిత్రలో డబ్బులు తీసుకుని వచ్చిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అంతేకాదు, రోజు వారి రెమ్యూనరేషన్‌తో కలిపి దాదాపు రూ. 50 లక్షల వరకూ సంపాదించాడట సోహెల్. అంటే విన్నర్ ఫ్రైజ్‌మనీతో సమానంగా.

టాలీవుడ్.. బాలీవుడ్‌నూ వదలకుండా సత్తా
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే 'జార్జిరెడ్డి' టీమ్‌తో కలిసి ఓ సినిమాను ప్రారంభించాడు సోహెల్. దానితో పాటు పలు చిత్రాలను కూడా ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. దీంతో ఈ యంగ్ సెన్సేషన్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

అరుదైన అవార్డును అందుకున్న రైజింగ్ స్టార్
బృహస్పతి ఫౌండేషన్ ప్రతి ఏటా రైజింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేస్తోంది. అన్ని రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న వాళ్లకు ఇవి ప్రదానం చేస్తున్నారు. ఇక, ఈ ఏడాదికి గానూ బిగ్ బాస్‌లో మెప్పించిన సయ్యద్ సోహెల్ రియాన్ దానికి ఎంపికయ్యాడు. అయితే, ఈ ఫంక్షన్ ఎప్పుడో జరిగినా.. తాజాగా దీన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అవార్డును చూపుతూ తన ఫోటోను షేర్ చేశాడు.

వాళ్లిద్దరి తర్వాత అతడితే ఘనత.. కామెంట్లు
గతంలో ఈ బృహస్పతి రైజింగ్ స్టార్ అవార్డును చాలా మంది బుల్లితెర ప్రముఖులు అందుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం చాలా మందిని ఇది వరించింది. అందులో బిగ్ బాస్ నాలుగో సీజన్ నుంచి అఖిల్ సార్థక్, దేత్తడి హారిక ఇప్పటికే దీన్ని తీసుకున్నారు. వాళ్లిద్దరి తర్వాత సోహెల్ తాజాగా దీన్ని అందుకున్నాడు. అతడి ఎదుగుదలకు ఇదే నిదర్శనం అన్న కామెంట్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











