యంగ్ హీరోయిన్‌తో సోహెల్ రొమాన్స్: అదిరిపోయే ఫొటోతో మేటర్ రివీల్ చేశారుగా
'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు యంగ్ సెన్సేషన్ సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన అతడు.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్లాడు. ఇలాంటి సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ షో ముగిసిన కొద్ది రోజులకే సోహెల్.. తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇందులో అతడికి జోడీగా నటించే హీరోయిన్ వివరాలను రివీల్ చేసింది చిత్ర యూనిట్.
సయ్యద్ సోహెల్ రియాన్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇందులో రూప కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. హోళీ పండుగను పురస్కరించుకుని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఇందులో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు హత్తుకుని కనిపిస్తున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక, రూప కొడువయూర్.. సత్యదేవ్ హీరోగా నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతో మెప్పించింది.

సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కిస్తున్నాడు. 'జార్జ్ రెడ్డి', 'ప్రెజర్ కుక్కర్' లాంటి వినూత్నమైన చిత్రాలతో ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ సంస్థ బ్యానర్‌పై అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూపై ఈ మూవీ రూపొందుతున్నట్లు.. ప్రతి మహిళా గర్వపడేలా దీన్ని తీస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని నిర్మాతలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











