'సైరా' జార్జియా షెడ్యూల్.. అనుకున్న సమయం కంటే ముందుగా!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ యుద్ద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ షెడ్యూల్ కోసం కనీసం నెలరోజులు సమయం పడుతుందని అంచనా వేశారు. కానీ షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుండడంతో అనుకున్న సమయం కంటే ముందుగా షెడ్యూల్ పూర్తి కానుంది.
ప్రతి రోజు ఫారెన్ ఆర్టిస్టులతో కలిపి ప్రతి రోజు 500 మంది సిబ్బంది ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. సన్నివేశాలు అనుకున్న విధంగా అద్భుతంగా వస్తున్నాయట. మెగాస్టార్ చిరంజీవితో పాటు తమిళ హీరో విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు.

చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేయనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











