గెట్ రెడీ.. 'సైరా నరసింహారెడ్డి' దూసుకొస్తున్నాడు!
సైరా నరసింహా రెడ్డి చిత్రం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.సైరా గెటప్ లో మెగాస్టార్ ఎలా ఉండబోతున్నాడు, స్వాతంత్ర సమరయోధుడిగా చిరు పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు అభిమానుల్లో నెలకొంది.
ఎప్పటి నుంచో సైరా చిత్రం కోసం చూస్తున్న అభిమానులకు శుభవార్త. సైరా నరసింహారెడ్డి టీజర్ ఆగష్టు 21 ఉదయం 11:30 గంటలకు సైరా చిత్ర టీజర్ విడుదల కానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ ప్రకటించింది.

దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











