Koffee With Karan: సెక్స్ లైఫ్ గొప్పగా లేదు.. కరణ్ జోహార్ షోపై తాప్సి కౌంటర్
తాప్సి ఆలోచించి మాట్లాడుతుందో తొందరపడి మాట్లాడుతుందో ఏమో తెలియదు గానీ కొన్నిసార్లు ఆమె చేసే కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర స్టార్ సెలబ్రిటీలకు కూడా కౌంటర్ గా ఆమె మాట్లాడినట్లుగా అనేక రకాల కథనాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆమె ఏ విధంగా చెప్పిందో గాని కరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షో ఇటీవల తాప్సీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ టూ బాలీవుడ్
తాప్సీ పన్ను మొదట టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె పూర్తిగా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ మరో స్థాయికి వెళ్ళింది. గ్లామరస్ పాత్రలో కూడా ఎక్కువగానే నటించింది. అలాగే కంటెంట్ ఉన్న మంచి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేసింది.

గతంలో అలా..
అయితే అప్పుడప్పుడు తాప్సీ పన్ను కొన్ని ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ అయితే వైరల్ గా మారిపోతున్నాయి. ఆ మధ్యకాలంలో రాఘవేంద్రరావు పై చేసిన కామెంట్స్ ఊహించని విధంగా అందరికీ ఆగ్రహాన్ని తెప్పించాయి. సౌత్ ఇండస్ట్రీలో తన మొదటి సినిమాల్లో పూలు పండ్లు అలాగే కొబ్బరికాయలు వేస్తారు అని ఆమె చేసిన కామెంట్స్ తెలుగువారిని తీవ్రంగా హార్ట్ చేశాయి. అయితే ఆ తర్వాత తాప్సి, తాను రాఘవేంద్రరావు గారిని తప్పు బట్టి ఆ విధంగా కామెంట్ చేయలేదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది.

కరణ్ షో పై కామెంట్స్
అయితే రీసెంట్ గా ఆమె కరణ్ జోహార్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్ పై కూడా ఊహించిన విధంగా కామెంట్ చేసింది. ఒక విధంగా ఆమె చేసిన కామెంట్స్ కు నెటిజన్లు నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. నిత్యం సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలతో ఆ షో కొనసాగుతూ ఉంటుంది అని అలాంటి షోపై తాప్సి సరైన కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న
రీసెంట్ గా తాప్సి తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. తాప్సి నటించిన దుబారా అనే సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదల కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నా ఆమె ఇటీవల కాలంలో చాలామంది సినిమా ప్రమోషన్లో భాగంగా కాఫీ విత్ కరణ్ షో పాల్గొంటున్నారు కదా మీరు కూడా అందులోకి ఎందుకు వెళ్ళలేదు అనే ఒక ప్రశ్న ఎదురయింది. అయితే తాప్సి ఆ ప్రశ్నకు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.

నాసెక్స్ లైఫ్ అంత గొప్పగా ఏమీ లేదు..
'కాఫీ విత్ కరణ్' షోకు మీరు వెళ్లరా అని మీడియా వాళ్లు అడగగానే అందుకు ఆమె బదులిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేలా నాసెక్స్ లైఫ్ అంత గొప్పగా ఏమీ లేదనీ.. వివరణ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక విధంగా సోషల్ మీడియాలో అయితే తాప్సి ఇచ్చిన సమాధానం సరైనదే అని అలాంటి షోలో నిత్యం అలాంటి విషయాలే మాట్లాడుతుంటారు కాబట్టి తాప్సి వెళ్లాల్సిన అవసరం లేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి తాప్సి చేసిన కామెంట్స్ పై కరెంటు జోహార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











