టాలీవుడ్ లో సక్సెస్ కోసం కసిగా సిద్దమవుతున్న యువ హీరోలు.. టైర్ 2 నుంచి టాప్ లోకి వెళ్లే ఛాన్స్?
తెలుగు సినిమా ప్రపంచంలో ఇప్పుడు కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న స్థాయి హీరోలు కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకోవాలని భిన్నమైన సినిమాలను చేస్తున్నారు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే భాషతో సంబంధం లేకుండా అందరికి రీచ్ అవుతాయి అనే నమ్మకంతో కూడా ధైర్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ వర్గం టైర్ 2 హీరోలు చాలా బలంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వారి తదుపరి సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

నాని దసరా
ముందుగా నాని దసరా గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ తెరపైకి తీసుకు వస్తున్నాడు. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ బాగానే వర్కౌట్ అయింది. కాబట్టి ఈ సినిమా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కంటెంట్ క్లిక్ అయితే మాత్రం నాని రేంజ్ మరో లెవల్ కి వెళుతుంది అని చెప్పవచ్చు.

ఏజెంట్ పై ఆశలు పెట్టుకున్న అఖిల్
మరో యువ హీరో అఖిల్ కూడా తన తదుపరి సినిమా ఏజెంట్ తో చాలా బలంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అది కూడా యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది. కాబట్టి మాస్ ఆడియోన్స్ లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఏజెంట్ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు.

వరుణ్ బిగ్ యాక్షన్ మూవీ
ఇక మెగా హీరో వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవదారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో దేశభక్తితో పాటు మంచి యాక్షన్స్ సన్నివేశాలు కూడా హైలెట్ కాబోతున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్లో తెరపైకి రాబోతోంది. ఇక ప్రవీణ్ సత్తారు కూడా ఇదివరకే గరుడవేగ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కాబట్టి ఈ జానర్ ను అతను కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడు అని ఆడియన్స్ లో కూడా ఒక నమ్మకం అయితే ఉంది.

సాయిధరమ్ తేజ్ కొత్త జానర్
ఇక మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈసారి విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది ఇతనికి సరికొత్త జానర్ అనే చెప్పాలి. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నితిన్
ఇక మరో హీరో నితిన్ తన 32వ సినిమాలను ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రైటర్ గతంలో ఎలాంటి విజయాలను అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి అతను దర్శకుడుగా తాను ఏంటో నిరూపించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. సీరియస్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయట. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











