వింత వ్యాధితో బాధపడుతున్న తమన్నా బాయ్ ఫ్రెండ్..! ఎవ్వరికి రాకూడని బాధ వచ్చిందిగా..

Vijay Varma: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా. ఈ అమ్మడు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార. అయితే.. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలపై కాకుండా బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలను చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా తమన్నా ఓ బాలీవుడ్ హీరో తో ప్రేమాయణం కొనసాగిస్తుందని, వారిద్దరూ త్వరలో పెళ్లి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ టాక్. అయితే తాజాగా మిల్క్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట. దీంతో తమన్నా తెగ బాధపడుతున్నారంట. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? అసలేం జరిగింది?

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా దూసుకవెళ్తుంది. మీర్జాపూర్, గల్లీ బాయ్స్, డార్లింగ్ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మిల్క్ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, పెళ్లికి ముందే ఓ ప్లాట్ తీసుకోబోతున్నారని పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

Tamanna Bhatia Lover Bollywood actor Vijay Varma suffering with vitiligo skin disease

తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ వర్మ ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, అది విటిలిగో అంటే బుల్లి అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. ఈ సమస్య వల్ల తన ముఖంపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయని, వాటిని దాచుకోవడానికి మేకప్, కాస్మోటిక్ ఉపయోగిస్తున్నట్లు విజయ వర్మ వెల్లడించారు. వాస్తవానికి ఈ వ్యాధి బయట పడినప్పుడు తాను ఎంతగానో భయపడ్డానని, సక్సెస్ అయ్యేందుకు తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశానని విజయ్ తెలిపారు.

వీటిలిగో అనేది వైట్ స్పాట్ డిసిజ్. దీనిని తెలుగులో బొల్లి అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన వ్యాధి. ఇది చర్మంపై ఎక్కడైనా రావచ్చు. చర్మం రంగు మారి తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వైద్య పరిభాష ప్రకారం.. చర్మం లోని మెలనిన్ సైట్స్ అనే మెలనిన్ కణాల సంఖ్య క్షీణించడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. కానీ ఇది అంటువ్యాధి కాదు.

Tamanna Bhatia Lover Bollywood actor Vijay Varma suffering with vitiligo skin disease

ఈ వ్యాధి నిర్మూలనకు సరైన నివారణ లేదు. కానీ, చికిత్సతో ఆ వ్యాధి వ్యాప్తిని మాత్రం ఆపవచ్చు. ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాస్త నివారించవచ్చు. తమన్నా బాయ్ ఫ్రెండ్ ఈ వ్యాధితో బాధపడుతున్నాడని నెట్టింట్లో వైరల్ కావడంతో తమన్నా బాయ్ ఫ్రెండ్ కు ఇంత కష్టం వచ్చిందా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యాధి ఉండి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొంతమంది ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరికి ఇలాంటి బాధ రాకూడని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: vijay varma tamanna bhatia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X