సిమ్ కార్డ్‌లు అమ్మి.. టాప్ హీరోయిన్‌తో ఎఫైర్.. ఆ నటుడి ఆస్తి ఎన్ని కోట్లంటే?
సినీరంగంలో స్టార్లుగా వెలుగొందుతున్న వారు అంత తేలికగా ఆ స్థాయికి చేరుకోలేదు. దీని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలి కేకలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నవారే. సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారు తప్పించి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారు ఎన్నో కష్టాలు పడిన వారే. తాజాగా పొట్టకూటి కోసం సిమ్ కార్డ్‌లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తితో కుబేరుడిగా మారారు. ఈ వివరాల్లోకి వెళితే..
తమన్నాతో లవ్, బ్రేకప్
విజయ్ వర్మ.. ఈ పేరు చెబితే ఎవరికీ గుర్తురాకపోవచ్చు కానీ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా మాజీ ప్రియుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఎఫైర్స్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చిన తమన్నానే మనోడు బుట్టలో పడేసి పెళ్లిదాకా తీసుకెళ్లాడు. అలాగే కెరీర్‌లో తొలిసారిగా లిప్‌లాక్, బెడ్ సీన్స్‌లో విజయ్‌తోనే చేశారు తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ రెండేళ్లు డేటింగ్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ తమన్నా - విజయ్ వర్మలు విడిపోయారు.

ఫాతిమాతో విజయ్ డేటింగ్?
ఇద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటీ అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్.. పెళ్లి చేసుకుని స్థిరపడి పోవాలని తమన్నాలు గట్టిగా పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక విడిపోయారని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. తమన్నాతో విడిపోయిన తర్వాత దంగల్ నటి ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ ప్రేమాయణం సాగిస్తున్నాడని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.
విలక్షణ నటుడిగా గుర్తింపు
ఎఫైర్ల సంగతి పక్కనబెడితే.. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. రోటీన్ కథలు కాకుండా విభన్నమైన అంశాలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతేడాది మర్డర్ ముబారక్ సినిమాతో పలకరించిన ఆయన వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్నారు. గతేడాది వచ్చిన ఐసీ 814: ది కందహార్ హైజాక్ సిరీస్‌లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం గుస్తాక్ ఇష్క్ అనే మూవీలో విజయ్ వర్మ నటించారు. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. సినిమాల్లోకి రాకముందు విజయ్ వర్మ ఎన్నో కష్టాలు పడ్డారు.
హైదరాబాద్ కుర్రాడే
పక్కా హైదరాబాదీ అయిన విజయ్ వర్మ ఇక్కడే తన సొంతూరిలోనే కెరీర్ ప్రారంభించాడు. పెట్రోల్ కార్డ్‌లు అమ్మడం దగ్గరి నుంచి కాల్ సెంటర్‌లలో పనిచేయడం వరకు అనేక చిన్న చిన్న పనులు చేస్తూ నటన వైపు అడుగులు వేశాడు. ఓసారి వేసిన డ్రామాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో నటనను కెరీర్‌గా ఎంచుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని ముంబైకి మకాం మార్చాడు. షోర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి.. పింక్, మిడిల్ క్లాస్ అబ్బాయ్, గల్లీ బాయ్, బాఘీ 3, మిర్జాపూర్, డార్లింగ్స్, కాల్‌కూట్ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సిమ్ కార్డ్‌లు అమ్మాను
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన విజయ్ వర్మ మాట్లాడుతూ.. తొలుత మొబైల్ కంపెనీలో పనిచేస్తూ.. సిమ్ కార్డ్‌లు అమ్మేవాడిని, ప్రతిరోజూ నోకియా షోరూమ్‌లోని మా బాస్‌కి రిపోర్ట్ చేసేవాడిని. నేను మూడు సిమ్‌లు మాత్రమే అమ్మిన రోజున నాల్గవది ఎక్కడ అని మా బాస్ నిలదీసేవాడు. ఆయన చేత చీవాట్లు తిన్న నేను ఏదో ఒకరోజున నా ఫోటోను మీ నోకియా షోరూమ్‌లో పెడతాను, దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ఛాలెంజ్ చేశా. జీవితంలో నేను గెలిచాను, కానీ నోకియా కంపెనీ లేదు అంటూ విజయ్ వర్మ చెప్పాడు. అలా ఒకప్పుడు సిమ్‌కార్డ్‌లు అమ్మిన విజయ్ వర్మకు ఇప్పుడు ముంబైలో విలాసవంతమైన ఇంటితో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











