రామ్ గోపాల్ వర్మ సినిమా.. కార్తీకి అవమానం.. థియేటర్ నుంచి నెట్టేసి..

తమిళ స్టార్ హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దక్షిణాది ప్రేక్షకుల్లో కార్తీక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దర్శించుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు కార్తీ. ప్రస్తుతం కార్తి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతున్నారు. తాజాగా తన కాలేజ్ డేస్ లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు..

కార్తీ తెలుగు సినిమాలు..
కార్తీ క్ ప్రత్యేకంగా తెలుగు సినిమాలు అంటూ ఏమి చేయలేదు. కానీ ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా కార్తీ ని ఆదరించడంతో ఆయన సినిమాలు ఇక్కడ కూడా ఒకే సమయంలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. యుగానికి ఒక్కడు, ఆవారా, శివ, శకుని, ఊపిరి, కాష్మోరా, ఖైదీ, ఖాకీ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్, జపాన్.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

Tamil Actor Karthi about Ram Gopal Varma Rangeela Movie

రాంగోపాల్ వర్మ సినిమా గురించి..
కార్తీ రీసెంట్ ఇంటర్వ్యూలో తన కాలేజ్ డేస్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ సినిమా గురించి కూడా మాట్లాడారు. రాంగోపాల్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన రంగీలా సినిమా కు కార్తీ తన స్నేహితులతో కలిసి వెళ్లారంట. కాలేజ్ మానేసి మరి ఆ సినిమాకు కేవలం తనహ తనహ అనే సాంగ్ చూసేందుకు వెళ్ళామని చెప్పారు. అయితే అప్పుడు టికెట్లు తీసుకోకుండా థియేటర్ లోపలికి వెళ్ళామని తనతో పాటు అందరిని థియేటర్ నుంచి నెట్టేసారని తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆ ఫన్నీ మూమెంట్ తనకు గుర్తు ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత కార్తీ హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

కార్తీ రీసెంట్ ఫిలిమ్స్..
చివరిగా కార్తీ జపాన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక తర్వాత కార్తీ తన అన్నయ్య సూర్య నటించిన కంగువ చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. కంగువ 2 లో కార్తి వర్సెస్ సూర్య గా సినిమా రూపుదిద్దుకోనుంది. అంతకుముందు సత్యం శివం సుందరం అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

కార్తీ నెక్ట్స్ రిలీజెస్..
ప్రస్తుతం కార్తీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సర్దార్ 2 చిత్ర పనుల్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. అలాగే 'వా వాతియార్' అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అలాగే కార్తీ లైనప్ లో ఖైదీ 2, విక్రమ్ 2, కంగువా 2, హిట్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: karthi ram gopal varma tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X