Flood Relief: మానవత్వం చాటుకొన్న శింబు.. తెలుగు రాష్ట్రాలకు భూరి విరాళం.. ఏకైక హీరోగా ఘనత
తెలుగు రాష్ట్రాలను తుఫాన్, వరద భీభత్సం అతలాకుతలం చేసింది. వరద ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రుయలయ్యారు. రెండు రాష్ట్రాల్లోను ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రజల పరిస్థితి విషాదకరంగా మారింది. ఇళ్లు నీట మునగడంతో చాలా మంది తిండి తిప్పలు లేకుండా అవస్థలు పడుతున్నారు.
గుండె పగిలేలా చేసిన ఇలాంటి దృశ్యాలను చూసిన సినీ పరిశ్రమ తాము ఉన్నామంటూ ఇప్పటికే ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేశారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా స్పందన వచ్చింది. హీరో శింబు తాజాగా తన ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తనకు మానవత్వం ఉందని నిరూపించుకొన్నారు. ఆయన ప్రకటించిన సాయం గురించిన వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొనడం చూసి తమిళ హీరో శింబు చలించిపోయారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ ప్రకటన చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆయన 6 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
అయితే తమిళ సినిమా పరిశ్రమ నుంచి తొలి హీరోగా శింబు ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చూపిన మానవత్వాన్ని చూసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి మనసు ఉన్న ఆయనకు అంతా మేలు జరుగాలని ఆకాక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, శింబుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలను భారీగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన సాయంతో మరింత మంది అభిమానుల్లో చోటు సంపాదించుకొన్నారనే చెప్పాలి.
ఇదిలా ఉండగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ తదితర హీరోలు ఇప్పటికే భారీ విరాళం అందించారు. సోనుసూద్ ప్రజలకు కావాల్సిన వస్తువులను, నిత్యావసర పదార్థాలను అందించేందుకు ముందుకు వచ్చారు.


Click it and Unblock the Notifications











