కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న ఎన్టీఆర్: అజిత్, రజినీకాంత్ తర్వాత నందమూరి హీరోనేనట.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తనలోని విద్యలన్నింటినీ బయటకు తీసుకొచ్చి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. అలాగే సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతోందట. అంతేకాదు, అజిత్, రజినీకాంత్ తర్వాత నందమూరి హీరోనే అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

వరుసగా ఐదు విజయాలతో రికార్డు
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఐదు విజయాలను అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా హీరోతో
వరుస విజయాలతో సత్తా చాటుతోన్న జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీలో తారక్.. భీంగా, చెర్రీ... అల్లూరిగా కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హస్తినకు పయనమవుతున్నాడు
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దీనికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందనుందని అంటున్నారు. అదే సమయంలో గురూజీ మార్క్ కూడా ఉంటుందని సమాచారం.

తర్వాత ఎవరు.? లిస్టులో ప్రశాంత్
రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ మాత్రం కొంత ముందున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ కాంబోను సెట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.

కోలీవుడ్‌లో ఎన్టీఆర్ పేరు హైలైట్
తెలుగులో సత్తా చాటుతూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే దక్షిణాదిలోని కొన్ని భాషల్లోనూ మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ పేరు కోలీవుడ్‌లో మారుమ్రోగిపోతోందట. దీనికి కారణం కోలీవుడ్‌లో ‘సిరుత్తై', ‘వీరం', ‘వేదాళం' వంటి సూపర్ హిట్ చిత్రాలతో బడా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ అని టాక్.
Recommended Video

అజిత్, రజినీకాంత్ తర్వాత తారక్
‘శౌర్యం'తో దర్శకుడిగా పరిచమైన శివ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలు తీసి సక్సెస్ కాలేక కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ విక్రమార్కుడు రీమేక్ ‘సిరుత్తై'తో హిట్ అందుకుని.. ఆ తర్వాత అజిత్‌తో ఎన్నో మూవీలు చేశాడు. ఇప్పుడు రజినీకాంత్‌తో ‘అన్నాత్తె' తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత శివ.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. కోలీవుడ్ హీరోలందరూ ఆయనతో సినిమా చేయాలని చూస్తుంటే.. శివ మాత్రం తారక్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











