వరుణ్ తేజ్ 'వాల్మీకి'లో చిత్రంలో తమిళ హీరో!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ ప్రతి చిత్రంలో తనదైన శైలిలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ కొత్త చిత్రం లాంచ్ అయింది. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'వాల్మీకి' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తాజగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళంలో నెగిటివ్ రోల్ లో బాబీ సింహ నటించాడు. ఆ పాత్రలోనే వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక సిద్దార్థ్ నటించిన పాత్రని తెలుగులో తమిళ నటుడు అధర్వ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు హరీష్ శంకర్ ఈ కథకు కొన్ని మార్పులు చేసే వరుణ్ తేజ్ పాత్రని హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా తమిళ బ్యూటీ మృణాళిని ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భామ డబ్ స్మాష్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











