చిరంజీవితో చేతులు కలిపిన స్టార్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడు. జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజగా ఈ చిత్ర షూటింగ్ లోకి తమిళ హీరో విజయ్ సేతుపతి జాయిన్ అయ్యాడు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో చిరంజీవి స్నేహితుడిగా బ్రిటిష్ వారిపై తిరగబడే యోధుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2019 వేసవిలో సైరా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రగ్యాజైశ్వాల్, తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











