MS Dhoni ధోనికి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందో అడగండి.. హీరో విశాల్ ఫైర్!
యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటించిన తాజా చిత్రం రత్నం. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్‌కుమార్ సంయుక్తంగా ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం అవుతున్న విషయంపై ఆయన స్పందిస్తూ...
సినిమా నిర్మాణం ఎవరు చేయవద్దని చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారు. ఆ వ్యాఖ్యల వెనుక నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అలాగని సినిమా పరిశ్రమను దిగజార్చే ప్రయత్నం లేదు. కానీ నాపై నా వ్యాఖ్యలను వక్రీకరించడం చాలా బాధ వేసింది. అయితే దానికి గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెబుతాను అని మీడియాకు వెల్లడించారు.

అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఫెయ్యిలూర్ రేటు ఎక్కువగా ఉంది. చాలా మంది నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలపై కోలుకోలేని దెబ్బ పడుతున్నది. అందుకే కొన్నాళ్లపాటు చిన్న నిర్మాతలు సినిమాను తీయడం మానేయాలని చెప్పాను. చిన్న సినిమాలకు ఆదరణ లేదు. కాబట్టి కొన్ని నెలలపాటు అలాంటి ఆలోచనలు ఉంటే ఆగమని చెప్పాను అని విశాల్ తెలిపారు.
అయితే నేను చిన్న నిర్మాతలకు ఏదో మేలు చేద్దామని నా అభిప్రాయాలను పంచుకొన్నాను. కానీ కొందరు విశాల్ అలా ఎలా మాట్లాడుతారు. యాక్టర్లు, సాంకేతిక నిపుణులు పరిస్థితి ఏం కావాలి? మిగితా నటీనటులు ఎలా బతకాలి అని నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరివైనా డబ్బులే. నేను కూడా మూడు పూటలు తినడానికి కష్టపడుతాను. నాలుగు డబ్బులు రావాలని సినిమాలపై పెట్టుబడి పెడుతాను అని అన్నారు.

@అంతేందుకు మహేంద్ర సింగ్ ధోని అంటే.. అందరికీ ఇష్టం. ఆయన క్రికెట్ ఆట ఆడుతుంటే. అందరం చప్పట్లు కొడుతాం. ఆయన ఆటను ఎంజాయ్ చేస్తాం. సినిమా రంగంపై ఇష్టపడి నిర్మాతగా ఓ మూవీ చేశాడు. అయితే ఎవరైనా ఆ సినిమాను చూశారా? ఆయననే అడగండి ఎంత నష్టం వచ్చిందో.. సినిమా తీయాలా వద్దా? అనేది ఆయనే క్లారిటీ ఇస్తాడు అని విశాల్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











