For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబరాలకు దూరంగా తారక్.. కారణమిదే! ఫ్యాన్స్‌కి సూచన

|
NTR Will Not Be Celebrating His Birthday This Year || Filmibeat Telugu

తన అభిమాన వర్గంతో ఎల్లప్పుడూ చాలా క్లోజ్‌గా ఉంటూ వారి బాగోగులు కోరుకోవడం జూనియర్ ఎన్టీఆర్ నైజం. అలాగే తారక్ అభిమానులు కూడా ఎక్కడా రచ్చ చేసిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటూ డీసెంట్‌గా ఉంటారు తారక్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు మాత్రం వారికి పండుగ రోజే. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్బంగా వారి కోలాహలం అంతా ఇంతా అని చెప్పలేం. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ, అక్కడక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ బర్త్ డే రోజును ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం తన బర్త్ డే వేడుక విషయమై తారక్ ఓ కండీషన్ పెట్టారని తెలుస్తోంది.

మే 20న తారక్ పుట్టిన రోజు

మే 20న తారక్ పుట్టిన రోజు

నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 సంవత్సరం మే 20 తేదీన తారక్ జన్మించారు. రామాయణం అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ గడప తొక్కిన తారక్.. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశారు. స్టూడెంట్ నెంబర్ 1 తో గుర్తింపు తెచ్చుకున్న తారక్ అంచెలంచెలుగా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు.

ఘనంగా వేడుకలు.. ఫ్యాన్స్ సంబరాలు

ఘనంగా వేడుకలు.. ఫ్యాన్స్ సంబరాలు

ప్రతీ సంవత్సరం మే 20 తేదీ వస్తోందంటే చాలు ఓ నెల రోజుల ముందు నుంచే పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు తారక్ ఫ్యాన్స్. గతేడాది ఆయన పుట్టిన రోజు సందర్బంగా ప్రతీ రోజు తారక్ నటించిన ఓ సినిమా విశేషాలను తెలుపుతూ ప్రేక్షకుల్లో జోష్ నింపారు తారక్ ఫ్యాన్స్. అలాగే మే 20 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. అయితే ఈ సారి మాత్రం పుట్టిన రోజు సమీపించినా ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.

తారక్ సూచన

తారక్ సూచన

గతేడాది ఆగస్ట్ 29 వ తేదీన తన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. దీంతో ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నారట. ఈ మేరకు ఫ్యాన్స్‌కి కూడా ఎలాంటి సంబరాలు చేయరాదని తారక్ పిలుపునిచ్చినట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు తారక్. భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఒక హీరోయిన్‌గా ఆలియా భట్ కన్ఫర్మ్ కాగా మరో హీరోయిన్ కోసం వేటలో ఉంది చిత్రయూనిట్.

English summary
On may 20 jr ntr birth day. Tarak decided not to celebrete this birthday. The reason behind is nandamuri harikrishna death on last year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more