పాలిటిక్స్ లోకి మాస్ లుక్ తో తారకరత్న ఎంట్రీ.. జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్!

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో తారకరత్న ఒకరు. అయితే అతను ఎక్కువ కాలం మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లోకి సరికొత్తగా గుర్తింపు అందుకునేందుకు అతను రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే అతని లేటెస్ట్ ఫోటోలు కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో అవి కూడా వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే..

మొదట్లో అలా..

మొదట్లో అలా..

టాలీవుడ్ స్టార్ హీరోలుగా నందమూరి హీరోలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. కానీ తారకరత్న మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్ను క్రియేట్ చేయలేకపోయాడు. అతను మొదట్లో ఒకేసారి పది సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. కానీ మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత మళ్ళీ అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.

 విలన్ గా హైలెట్

విలన్ గా హైలెట్

ఏదో ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ తో ఆడితే సినిమాలు చేసుకుంటూ వచ్చిన తారకరత్న కొన్నాళ్లకు హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ పాత్రలు కూడా చేశాడు. అయితే అమరావతి సినిమాలో మాత్రం అతనికి విలన్ గా మంచి గుర్తింపు దక్కింది. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నెగిటివ్ రోల్స్ చేశాడు. ఇక రీసెంట్ గా 8 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా కూడా అతను మంచి క్రేజ్ అందుకున్నాడు.

రెగ్యులర్ పాలిటిక్స్

రెగ్యులర్ పాలిటిక్స్

అయితే గతంలో రెగ్యులర్ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించని తారకరత్న ఇప్పుడు మాత్రం క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా మారెందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. ఇటీవల తను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఒక ప్రకటన అయితే ఇచ్చేశాడు. భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలతో ర్యాలీ నిర్వహించి మరి ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని చాటుకునెందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో పోటీ

వచ్చే ఎన్నికల్లో పోటీ

అయితే తారకరత్న ఇకనుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉంటాను అని అంతేకాకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని అన్నాడు. ఇక తప్పకుండా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని తారకరత్న తెలియజేశాడు. ఇక తారకరత్నకు సంబంధించిన లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ పై కామెంట్!

ఎన్టీఆర్ పై కామెంట్!

ఇక తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారాలలో పాల్గొంటాడని అన్నాడు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ కూడా ప్రచారాలు చేసింది లేదు. ఇప్పట్లో తాను రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు అని కూడా అని అన్నాడు. మరి తారకరత్న ఇచ్చిన వివరణతో జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X