విజయేంద్రప్రసాద్ సపోర్ట్ మరువలేనిది.. ట్యాక్సీ మూవీ హీరో వసంత్ సమీర్ ఎమోషనల్

యువ నటుడు, రచయితగా రాణిస్తున్న వసంత్ సమీర్ ప్రస్తుతం ట్యాక్సీ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆయన నటించిన ట్యాక్సీ సినిమా మార్చి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఉబర్ పూల్‌లో ప్రయాణిస్తున్న నలుగురు మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంగా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ వద్ద పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

Actor, Writer Vasanth Sameer is testing the water with Taxi Telugu filmi in Tollywood.

మా నాన్న గారు చైతన్య రైటర్‌గా నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ చేశారు. సినిమా పరిశ్రమలో పనిచేయాలని 13 ఉద్యోగాలు మానేశాడు. లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివారు. ఆర్కే ఫిలింస్‌లో రాఘవేంద్రరావు వద్ద పనిచేస్తూ మమ్మల్ని వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత భీమిలి కబాడ్డీ జట్టు సినిమాకు డైలాగ్స్ రాశారు. శ్రీకృష్ణ 2006 స్క్రీన్ ప్లే చేశారు. గ్రాడ్యుయేట్ సినిమా చేశారు. అయితే మా అన్నయ్య యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేశారు. యాక్టింగ్‌లో రాణించాలంటే చాలా సంవత్సరాలు కష్టపడాలి. అయితే నీవు కష్టపడు.. ఏదో ఒక రోజు నీకు గుర్తింపు వస్తుంది. నేను ఈ స్టేజ్‌కు రావడానికి నా బలమైన పిల్లర్‌గా నిలిచారు. ప్రతీ స్టేజ్‌లో ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు అని వసంత్ సమీర్ తెలిపాడు.

నేను కాలేజీ తర్వాత యాక్టింగ్ ఆఫర్ల కోసం ఆడిషన్స్‌కు వెళ్లే సమయంలో మా నాన్న గారి ద్వారా విజయేంద్ర ప్రసాద్ టీమ్‌లో చేరాను. విజయేంద్ర ప్రసాద్ వద్ద కథ, కథనాల విషయంలో చాలా మెలుకువలు నేర్పించారు. ఆయనతో చాలా కథలు డిస్కషన్ చేశాను. ఆయన కథ చెప్పినప్పుడు నాకు నచ్చితే.. నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాను. నేను యాక్టర్ అవుదామని చెబితే.. నన్ను ప్రోత్సహించారు. నీవు ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చు. నీకు మా వద్ద అవకాశం ఉంటుందని ప్రోత్సాహించారు. స్టోరి మేకింగ్‌లో నేను చాలా ట్రిక్కులు నేర్చుకొన్నాను. నేను యాక్టర్ అయితే స్క్రిప్టు సెలక్షన్‌లో కూడా నాకు ఉపయోగపడుతుందని అనుకొంటున్నాను అని వసంత్ సమీర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X