twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింహాద్రి అనుకుంటే చాగంటిలా మాట్లాడాడు.. పిల్లలు కూడా నవ్వారు.. ఎన్టీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు

    |

    టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మీద సొంత పార్టీకి చెందిన నేతలే విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీలో పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    మళ్లీ తెర మీదకు

    మళ్లీ తెర మీదకు

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ స్పందన వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు, ఆయన కుటుంబానికి మద్దతు లభించింది.

    చంద్రబాబుకు మద్దతుగా

    చంద్రబాబుకు మద్దతుగా

    సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సోనూ సూద్, రజనీకాంత్ లాంటి వారు సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలిచి ఫోన్ చేసి పరామర్శించారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా నిలవడమే కాక నందమూరి ఫ్యామిలీ అంతా భువనేశ్వరికి అండగా నిలుస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.

    ఎన్టీఆర్ వీడియో విడుదల

    ఎన్టీఆర్ వీడియో విడుదల

    మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయం మీద ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని.. ఒక కొడుకుగా.. తండ్రిగా మాట్లాడుతున్నాని జనరలైజ్ చేస్తూ మాట్లాడారు. ఈ విషయం మీద టీడీపీ శ్రేణులు ముందు నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.

    ఎందుకు హెచ్చరించ లేదు

    ఎందుకు హెచ్చరించ లేదు

    టీడీపీ నేత వర్ల రామయ్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పన్నెండు గంటల పాటు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి మేనత్తను దారుణంగా తిట్టినా ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే కదా, వారిని ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు.

    ప్రవచనాలు లాగా ఉన్నాయి

    ప్రవచనాలు లాగా ఉన్నాయి

    అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఉందని ఈ కారణంగా ఎన్టీఆర్ పద్దతిగా స్పందించారని వస్తున్న వాదనలపై వర్ల రామయ్య స్పందించారు. అందరికీ సినిమాలు ఉంటాయన్న ఆయన బాలకృష్ణ సినిమా రిలీజ్ కు లేదా అని ప్రశ్నించారు. కష్టకాలంలో అండగా ఉన్న వారే పార్టీ సభ్యులని పేర్కొన్న ఆయన ఆ వీడియోలో జూనియర్ స్పందన వింటే.. ప్రవచనములు చెప్పినట్లు ఉందన్నారు. ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారు అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

    ఎన్టీఆర్ మాట మీదే టికెట్లు

    ఎన్టీఆర్ మాట మీదే టికెట్లు

    ఇక ఇదే విషయం మీద ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మరో నేత నాగుల్ మీరా కూడా స్పందించారు. ఎన్టీఆర్ స్పందన ఆది, సింహాద్రిలా ఉంటుందనుకుంటే... చాగంటి గారిలా ప్రవచనాలు చెప్పారని మండిపడ్డారు. నిజానికి ఒకప్పుడు ఎన్టీఆర్ ఒత్తిడితోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. అయితే అలాంటి వారే ఇప్పుడు పార్టీకి ఎదురు తిరిగి దారుణంగా మాట్లాడుతున్నారు.

    Recommended Video

    అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
    కొడాలి నాని ఏమన్నారంటే?

    కొడాలి నాని ఏమన్నారంటే?

    అయితే ఈ విషయం మీద 'జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటి?' అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ చెబితే తామెందుకు వింటామని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు భార్య గురించి ఏమీ అనలేదని, నందమూరి ఫ్యామిలీ అంటే జగన్ కి కూడా గౌరవమేనని వ్యాఖ్యానించారు. భువనేశ్వరి పేరు తీస్తే నందమూరి కుటుంబం మద్దతిస్తుందని చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు.


    English summary
    TDP Leader Varla Ramaiah made sensational comments on Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X