Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోగా బిజీ అవుతున్న జాంబిరెడ్డి తేజ.. ఏకంగా బడా బ్యానర్ లో లక్కీ ఛాన్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోలు నిలదొక్కుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. గతంలో ఎప్పుడు లేని విదంగా పోటీ తీవ్రత మరింత ఎక్కువయ్యింది. ఈ రోజుల్లో జనాలను ప్రతి సినిమాతో ఎట్రాక్ట్ చేస్తేనే ఒక స్థిరమైన మార్కెట్ సెట్టవుతుంది. ఇక ఇప్పుడు అదే తరహాలో కెరీర్ ను సెట్ చేసుకుంటున్నాడు తేజ సజ్జ. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చక్రం తిప్పిన విషయం తెలిసిందే.
ఇంద్ర సినిమాతోనే తేజకు మంచి క్రేజ్ దక్కింది. ఇక లక్ష్మీ సినిమాలో చిన్నప్పటి వెంకటేష్ గా కూడా మంచి నటనతో పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక చాలా కాలం తరువాత సమంత ఓ బేబి సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ లో నటించిన తేజ ఆ తరువాత జాంబీ రెడ్డి సినిమాతో సోలో హీరోగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వడంతో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో తేజ చాలా జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో చేసిన ఇష్క్ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా శివాని రాజశేఖర్ తో కలిసి నటిస్తున్న మరో మూవీ కూడా రెడీ అవుతోంది.
ఇక ఇటీవల వైజయంతి బ్యానర్ లోనే మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ లో వచ్చిన చూడాలని వుంది సినిమా ద్వారానే తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే బ్యానర్ కు చెందిన స్వప్న సినిమాస్ లో హీరోగా సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.