నాడు మహేష్ బాబుకు కొడుకుగా, నేడు పోటీగా తేజ సజ్జా.. దీనిపై కుర్రహీరో రియాక్షన్ ఏంటంటే?

ఈ ఏడాది సంక్రాంతికి అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. పండుగను మరింత క్రేజీగా మార్చేందుకు మొత్తం 8 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రాలు 5 ఉండగా.. తమిళ్, మలయాళ సినిమాలు కూడా తెలుగులో విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం,తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్, ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్, విజయ్ సేతుపతి కథానాయకుడిగా చేసిన మేరీ క్రిస్మస్ కూడా జనవరి 12వ తేదీనే విడుదల కాబోతున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా 13వ తేదీన విక్టరీ వెంకటేష్ సైంధవ్, మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాలు, ఆ తర్వాతి రోజు అంటే 14వ తేదీ రోజు నాగార్జున హీరోగా చేసిన నా సామిరంగ సినిమా రిలీజ్ కాబోతుంది. మొత్తం సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం మూడు రోజుల్లో 8 చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈక్రమంలోనే నెట్టింట చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, తేజ సజ్జాల గురించి అయితే ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Teja Sajja Crazy Reaction on His Hanuman Movie Clash With Mahesh babu Guntur Kaaram

2000వ సంవత్సరంలో వచ్చిన యువరాజు సినిమాలో తేజ సజ్జా మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించాడు. ఇప్పుడేమే అంటే 2024 సంక్రాంతికి తన హనుమాన్ సినిమాతో మహేష్ గుంటూరు కారంకి పోటీ ఇవ్వనున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. ఇది చూసిన కుర్రహీరో తేజా సజ్జా షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఎవరూ ఊహించని స్థాయిలో రీట్వీట్ చేశాడు. అదేంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీ ఏంటి సార్.. అంటూ తల పట్టుకునే, అలాగే దండం పెట్టే ఎమోజీలను యాడ్ చేశాడు. అలాగే అయనతో పోటీగ కాదు సర్.. అయనతో పాటుగ బరిలోకి వస్తున్నారని అనండి అంటూ వివరించాడు.

Teja Sajja Crazy Reaction on His Hanuman Movie Clash With Mahesh babu Guntur Kaaram

తేజ సజ్జా ఇచ్చిన ఈ రిప్లై చూసిన హనుమాన్ సినిమా డైరెక్టర్ దీనిపై స్పందించారు. చాలా బాగా చెప్పావు అంటూ హీరో తేజ సజ్జాను సపోర్ట్ చేశారు. ప్రస్తుతం తేజ సజ్జ ఇచ్చిన ఈ రిప్లై నెట్టింట వైరల్ గా మారింది. ఇదంతా ఇలా ఉండగా.. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అలాగే తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ నటించబోతుంది.

Teja Sajja Crazy Reaction on His Hanuman Movie Clash With Mahesh babu Guntur Kaaram

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా విజ్యువల్ వండర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X