మళ్ళీ ఆ డైరెక్టర్ తోనే తేజ సజ్జా.. ఈ సారి కూడా ప్రయోగమేనా ?
ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా ఆయన జాంబీ రెడ్డి అనే సినిమా చేశారు. మరో సినిమా ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా కారణంగా తెలంగాణలో థియేటర్లు మూసివేసిన నేపధ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే తనను హీరోగా పరిచయం చేసిన ప్రశాంత్ వర్మతో తేజ మరో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా ఉన్న సరే జాంబీ రెడ్డి సినిమా చేసిన సమయంలో ఈ దర్శకుడితో తేజకు ర్యాపో బాగా పెరిగిందట.
వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు
ఈ నేపథ్యంలోనే వేరే హీరోలతో సినిమా చేసే కంటే తేజతో సినిమా చేయడం బెటర్ అని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరలో ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి తేజకు కథ చెప్పగా తేజ ఫైనల్ చేశాడని ప్రశాంత్ వర్మ ఇప్పుడు స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అని తెలుస్తోంది. జాంబీ రెడ్డి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైంది ఈ నేపథ్యంలోనే సదరు దర్శకుడుతో మరో ప్రయోగం చేయడానికి కూడా తేజ సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా తేజ ఇష్క్ అనే సినిమా చేశాడు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఇది ఈ సినిమా వాస్తవానికి 23వ తేదీ విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లన్నీ మూసివేసిన కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ దియేటర్లు ఓపెన్ చేశాక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











