Pan India లెవల్లో తెలుగు హీరోల సత్తా.. టాప్ టెన్లో ఐదుగురు మనోళ్లే.. ఎవరెవరంటే?
ప్రస్తుతానికి తెలుగు హీరోలు, తమిళ హీరోలు, బాలీవుడ్ హీరోలు అని కాకుండా పాన్ ఇండియా హీరోలు అని పిలిపించుకోవడానికి మన స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే తాము చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరు అంటే చెప్పడం ఎలా కష్టమో పాన్ ఇండియా హీరోల్లో నెంబర్ వన్ ఎవరు అని చెప్పడం కూడా అంతే కష్టం.. అయితే పాపులర్ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా మాత్రం ప్రతి నెల సోషల్ మీడియా మీడియా ట్రెండ్స్ ను బట్టి అంచనాలు వేసి లిస్టులు విడుదల చేస్తోంది. తాజాగా మే నెలకు సంబంధించిన హీరోల లిస్ట్ విడుదలయ్యింది. ఈ లిస్టులో తెలుగు హీరోలు దాదాపు ఐదుగురు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ లిస్టు మీద ఒక లుక్ వేద్దాం.

1.విజయ్ 2. ప్రభాస్
ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు. తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ హీరో పాన్ ఇండియా హీరోలలో మొదటి స్థానం సంపాదించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ప్రభాస్ ఈ జాబితాలో రెండవ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న దాదాపు నాలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

యష్ 4. అజిత్ కుమార్
కేజిఎఫ్ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న యష్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతకు ముందు కేవలం కన్నడ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయిన ఆయన ప్రశాంత్ నీల్ తో చేసిన కెజిఎఫ్ సిరీస్ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుని ముందుకు దూసుకు వెళుతున్నాడు. తమిళ స్టార్ హీరో అజిత్ ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. చివరిగా వలిమై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.

5.అక్షయ్ కుమార్ 6. అల్లు అర్జున్
చివరిగా సామ్రాట్ పృథ్వీరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో దక్కించుకున్నాడు. ఇక పుష్ప మొదటి భాగంతో పాన్ ఇండియా లెవెల్ లో రచ్చ రేపిన అల్లు అర్జున్ ఈ జాబితాలో 6వ స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో భవిష్యత్తులో మున్ముందు స్థానాలు దక్కించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.

7. ఎన్టీఆర్ 8. మహేష్ బాబు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏడవ స్థానానికి పరిమితం అయ్యాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రెండు సినిమాలు ప్రకటించాడు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చివరిగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని మహేష్ బాబు ఈ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

9. రామ్ చరణ్ 10. సూర్య
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ఆచార్య సినిమా నిరాశపరిచినా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి మరో హిట్ కొట్టడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. ఈ లిస్టులో హీరో సూర్య పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం మీద ఈ లిస్టు ఆసక్తి రేపుతోంది.


Click it and Unblock the Notifications











