ఆ హీరోయిన్ తో బ్రేకప్.. నా కాపురంలో చిచ్చు పెట్టకండి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంల తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. అందులో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ ను కూడా తెలుగువారు మర్చిపోలేరు. బక్కపలచని శరీరం.. ఒత్తైన జుట్టుతో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మొదటి సినిమా అయినా కూడా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్ళు ఉన్నా కూడా వరుణ్ కే ఎక్కువ పేరు వచ్చింది. హ్యాపీ డేస్ తరువాత వరుణ్ ఒక స్టార్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు.

కొత్త బంగారు లోకం సినిమా తరువాత అసలు ఈ కుర్రాడికి తిరుగే లేదు అనుకున్నారు. కానీ, అతనికి సినిమా అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించిన విజయాలు మాత్రం రాలేదు. దాదాపు ఒక 20 కి పైగా సినిమాలు చేసినా కూడా వరుణ్ కు స్టార్ హీరోగా గుర్తింపు రాలేదు. దాదాపు కనుమరుగైన ఈ హీరో తన బ్రేకప్ గురించి వెల్లడించిన విషయంలోకి వెళితే..

Telugu Hero Varun sandesh sensational comments about his first love and breakup

క మధ్యలో వరుణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. హీరోయిన్ వితికా షేరును వివాహాం చేసుకొని సెటిల్ అయ్యాడు. ఇక ఈ జంట 2019లో బిగ్‌బాస్‌ లో సందడి చేసిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ తరువాత మరోసారి జనాలకు వరుణ్ దగ్గరయ్యాడు. అంతకుముందులా కాకుండా ఈ మధ్య మంచి కథలను ఎంచుకొని డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో బీనటిస్తూ మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం వరుణ్ సందేశ్.. నింద అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ .. దావత్ అనే చిట్ చాట్ షోకు గెస్ట్ గా వెళ్ళాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ షోకు హాట్ బ్యూటీ రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Telugu Hero Varun sandesh sensational comments about his first love and breakup

కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడగడం, వారు పరసనల్ లైఫ్ లోని అనుభవాలను అడుగుతూ వచ్చినవారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తాజాగా వరుణ్ ను తన లవ్ బ్రేకప్ గురించి అడిగి అతడికి షాక్ ఇచ్చింది. .. హీరోయిన్ శ్రద్దా దాస్ తో మీరు బ్రేకప్ అయ్యారంట.. ఏంటి ఆ స్టోరీ అని అడిగింది..దానికి వరుణ్ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.

Telugu Hero Varun sandesh sensational comments about his first love and breakup

"ఇప్పుడు అలాంటి విషయాలు మాట్లాడకండి.నా పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అవుతోంది. మా మధ్య గొడవలు పెట్టకండి.అప్పట్లో మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం.కానీ ప్రస్తుతం ఎవరి జీవితం వారిది. వాటి గురించి మాట్లాడదలచుకోలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.

వరుణ్- శ్రద్దా కలిసి మరో చరిత్ర అనే సినిమాలో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమాయణం నడిచింది అన్న వార్తలు వచ్చాయి కానీ, అందులో నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వరుణే స్వయంగా ఒప్పుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X