టెంపర్ తమిళ రీమేక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!
హీరో విశాల్ కు తమిళంతో పాటు, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకరకంగా విశాల్ కు తెలుగు రాష్ట్రాలు సొంత గడ్డ లాంటివే. విశాల్ నటించే ప్రతి చిత్రం తెలుగులో కూడా విడులవుతుంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్ టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజగా తమిళంలో ఈ చిత్రాన్ని అయోగ్య పేరుతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. క్రేజీ కాప్ రోల్ లో విశాల్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జీప్ పై కూర్చుని చేతిలో బీర్ బోటిల్ తో విశాల్ కనిపిస్తున్నాడు. టెంపర్ చిత్రంతో తొలి అర్థ భాగం వరకు హీరో పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి.

అవినీతిని ప్రోత్సహించే పోలీస్ అధికారి రియల్ హీరోగా ఎలా మారాడు అనేదే ఈ చిత్ర కథ. వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. విశాల్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శామ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











