ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న బాలయ్య: రెండు సినిమాల తర్వాత BB3లో.. అదే జరిగితే హిట్టేనట!
ఒకప్పుడు వరుస విజయాలతో సత్తా చాటి.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. అందుకే గతంతో పోలిస్తే ఆయన సినిమాల వేగం బాగా తగ్గించారు. దీంతో నందమూరి అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడయన. ఇందుకోసం అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఒకే ఏడాది మూడు ఫ్లాపులతో సతమతం
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు నటసింహా బాలకృష్ణ. ఇందులో భాగంగానే 2019లో ఏకంగా మూడు సినిమాలు (యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, రూలర్) చేశాడాయన. ఇవన్నీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, ఈ మూడింటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవలేదు.

ఇద్దరికీ హిట్ కావాలి.. అందుకే స్పెషల్‌గా
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న బాలకృష్ణ.. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలకు మించిన హిట్‌తో హ్యాట్రిక్ కొట్టాలని దీన్ని స్పెషల్‌గా తీస్తున్నారు.

కెరీర్‌లోనే ప్రత్యేకమైన పాత్రలో బాలకృష్ణ
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి యాభై కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఇక, ఈ సినిమాలో నటసింహా రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అఘోరా పాత్ర అని కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పుడు లేవు.. ఇప్పుడు మాత్రం భారీగా
వాస్తవానికి క్రేజీ కాంబినేషన్ అయినప్పటికీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో ఈ ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కూడా ముందుకు వచ్చేలా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో BB3 పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ వీడియోకు అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఫలితంగా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న బాలయ్య
సినిమా పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోని ఫ్లాపులు వస్తున్న సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్న నందమూరి బాలకృష్ణ... తన కొత్త చిత్రం BB3 కోసం ఓ పాత సెంటిమెంట్‌ను వాడబోతున్నాడట. అంతేకాదు, దీని వల్ల కచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమన్న అంచనాలో ఉన్నారని తెలుస్తోంది.

రెండు సినిమాల తర్వాత BB3లో.. హిట్టేనట
BB3 కోసం హైదరాబాద్‌లో ఓ టెంపుల్ సెట్ వేస్తున్నారట. దీని కోసం రూ. 30 లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఈ సెట్ వేయడానికి కారణం బోయపాటి - బాలయ్య కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాల్లోనూ ఈ తరహా సెట్లు వేశారు. ఆ రెండు చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. సో.. కొత్త సినిమాలోనూ అదే ఫాలో అయితే హిట్ వస్తుందని భావిస్తుందట యూనిట్.


Click it and Unblock the Notifications











